సారొస్తున్నారు సరే…?
2023 నవంబర్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చ నీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్‌లోకి ఆయన వచ్చింది లేదు.
ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ బిఆర్‌ఎస్‌కు చేసిన నష్టం ఏమిటో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థ మవుతున్నది. ఈ రెండేళ్లలో బిఆర్‌ఎస్ ఎన్నికల లో ఓడిపోవడమే కాకుండా ఇంటా బయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది శాసనసభ్యులతో పాటు జిహెచ్‌ంఎసి మేయర్ వలస పోయారు. వాటికంటే ప్రధానమైనది కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లి పోయాక కూడా బిఆర్‌ఎస్‌కి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నార ని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్ని హిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయ త్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడా నికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణలో గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించిన ఉత్సాహభరితమైన మూడ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్న తరుణంలో నేడు కెసిఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలుసుకోవడానికి వస్తుండటం విశేషం. రెండు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడినప్పుడు కెసిఆర్ మళ్లీ బయటకు వస్తున్నారన్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావిస్తే ‘ఆయన అధికారంలో ఉండగానే ఎదుర్కొని ఓడించాం.. ఇప్పుడు అది పెద్ద విశేషం కాదు’ అన్నారు.
2023 నవంబర్ లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కెసిఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చనీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్ లోకి ఆయన వచ్చింది ఎప్పుడూలేదు.
శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఈ రెండేళ్లలో ఓ రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటికంటే ముందు అత్యంత కీలకమైన లోకసభ ఎన్నికలు జరిగాయి. నిన్నగాక మొన్న గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా ముగిసినా వీటిల్లో ఎక్కడ కెసిఆర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నది లేదు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి తనకింది నాయకులు అందరికీ దిశానిర్దేశం చేస్తే చేసి ఉండవచ్చు. పైన పేర్కొన్న అన్ని ఎన్నికల్లో కూడా, గ్రామపంచాయతీలు మినహాయిస్తే, భారత రాష్ట్ర సమితి ఘోర వైఫల్యం చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యంత కీలకమైన సందర్భాలలో కూడా ఆయన మౌనంగానే ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెసిఆర్ రాజకీయాలను దగ్గరినుండి చూసినవాళ్లకు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు.
ఈ రెండు సంవత్సరాలూ బయటకు రాకుండా తెరవెనకే ఉండిపోవడం కూడా కెసిఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే అని ఆయన సమర్థకులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమ కాలంలో కూడా ఆయన ఈ వ్యవహారశైలి చూశాం. కొన్ని సందర్భాల్లో కెసిఆర్ బయట కనిపించకపోతే ‘ఇదేమిటి, నాయకుడు బయటికి రాకుంటే ఎలా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో’ అన్న విమర్శ వినిపించేది. మళ్ళీ హఠాత్తుగా ఆయన బయటకు వచ్చేవారు. కెసిఆర్ ఒక విషయాన్ని నమ్ముతుంటారెమో బహుశా. అస్తమానం జనంలో కనిపిస్తూ ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి అవసరమైనప్పుడే బయటికి రావాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.
కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చేసిన నష్టం ఏమిటో ఆయన పార్టీ నాయకత్వానికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థమవుతున్నది. ఈ రెండేళ్లలో భారత రాష్ట్ర సమితి ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా ఇంటాబయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది పార్టీ శాసనసభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ప్రతిష్ఠాత్మకమయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వలసపోయారు. వాటికంటే ప్రధానమైనది కెసిఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లిపోయాక కూడా భారత రాష్ట్ర సమితికి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? కవిత పార్టీలో ఉన్నప్పుడు జరిగిన నష్టం ఆమె మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం. కవిత తీహార్ జైల్లో కొన్ని మాసాలు గడిపి బయటికి వచ్చిన కొద్దికాలంలోనే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపట్ల కినుక వహించడం, తిరుగుబాటు చేయడం, సస్పెండ్ కావడం అక్కడి నుండి దాదాపు ప్రతిరోజూ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, గతంలో పార్టీ అధికారంలో ఉండగా జరిగాయంటున్న అవినీతి కార్యక్రమాల గురించి ఆమె చేస్తున్న ప్రకటనలు మామూలుగా తీసిపారేయవలసినవి కావు.ఈ నష్టం జరగకుండా నివారించడానికి కెసిఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కవిత చేస్తున్న ఆరోపణలు, దానికి బదులుగా ఆమెమీద కొందరు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రత్యారోపణలలో వాస్తవం ఎంత ఉంది అన్నది అలా ఉంచితే ఈ క్రమంలో జరుగుతున్న నష్టం మాత్రం చిన్నది కాదు. కెసిఆర్ ఎందుకు దీన్ని నివారించాలేనంత అశక్తులు అయిపోయారు? కవిత ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మీద, సీనియర్ నాయకుడు హరీశ్ రావు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న విమర్శలలో వాస్తవం ఎంత ఉంది అనేది అలా ఉంచితే దానివల్ల పార్టీకి నష్టం జరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని నివారించే లేదా ఇదంతా జరిగిపోయాకనైనా చక్కదిద్దే స్థితిలో కెసిఆర్ లేరా!
భారత రాష్ట్ర సమితి పగ్గాలు కెసిఆర్ చేతుల్లో లేకపోతే ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో జరపబోతున్న సమావేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎన్నికలొచ్చినప్పుడే బయటకు రావాలని ఆయన అనుకుంటున్నారా? రాష్ట్రసాధన కోసం ఇంత పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, తొమ్మిది సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా తనను ఓడించారని ప్రజలమీద అలిగి ఆయన బయటకు రావడం లేదా? ఇది వెనకటికి చెప్పిన ముతక సామెతలాగా ఉంది. చెరువు మీద అలిగితే ఎవరికీ నష్టం?
ఇవాళ తన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కెసిఆర్ వచ్చే మూడు సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్ని నడుపుతారా లేక మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళిపోతారా అన్నది శేష ప్రశ్న. అందుకు కారణం గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో.. ముఖ్యంగా పార్టీ రజతోత్సవం జరిగిన సమయంలో కెసిఆర్ మళ్ళీ చురుగ్గా రాజకీయ క్షేత్రంలో నిలబడతారని ప్రచారం జరిగింది కానీ షరామాములే. భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కూడా కెసిఆర్ అయిన కారణంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించాలని పార్టీకి సంబంధించిన వారు ఆశిస్తారు. కనిపించకపోతే బయటివారు విమర్శిస్తారు. చూస్తూనే ఉన్నాం కదా, అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాలు విసురుతూ ఉంటారు.. ‘కెసిఆర్ ను శాసనసభకు రమ్మనండి అన్ని విషయాలు చర్చిద్దాం’ అని. రేవంత్ రెడ్డి సవాలును భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, కెసిఆర్ అభిమానులు తేలిగ్గా కొట్టిపారేయవచ్చుగాక, కానీ జనం దృష్టిలో మాత్రం రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడుతున్నాయి.
ఇవాళ జరగబోయే సమావేశంలో కెసిఆర్ ఏ అంశాలు చర్చించబోతున్నారు? తన పార్టీ ప్రజాప్రతినిధులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అనే విషయాలు కూడా బయట చర్చనీయాంశాలయ్యాయి. ప్రభుత్వపక్షమే అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం మొన్న ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో 33% పంచాయతీలను భారత రాష్ట్ర సమితి, బిజెపి దక్కించుకున్నాయి. ఇందులో బిజెపిని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపి నాయకులు తమ పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నా, అందులో సింహభాగం భారత రాష్ట్ర సమితికే దక్కిన విషయం అందరికీ తెలిసిందే. పైగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినవి కాదు. దీని తర్వాత జరిగే ఎన్నికలు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీల గుర్తులు మీద జరిగేవి. కాబట్టి పంచాయతీలు ఇచ్చిన ఉత్సాహంతో వీటిలో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయబోతున్నారా కెసిఆర్?
అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో తన తర్వాత కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు కె.టి.రామారావు, హరీశ్ రావులకు రానున్న మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలలో బాధ్యతలను పంచే ఆలోచన కూడా కెసిఆర్ చేస్తున్నారని వినికిడి. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలు కెటిఆర్‌కు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల ఎన్నికల బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించి సమాన స్థాయి కల్పిస్తారని ప్రచారం. ఇదే కాకుండా ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడానికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోవాలని జరిగిన ఉద్యమంలోని మూడు ప్రధాన అంశాల్లో అత్యంత కీలకమైనవి నీళ్లు, నిధులు, నియామకాలు ఆ తర్వాతనే. మరి ఇంత ముఖ్యమైన అంశంలో చంద్రబాబు తన అధికారాన్ని, సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నీళ్లు తరలించుకుపోతానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉంటుందా? తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు వత్తిడికి లొంగి తెలంగాణకు ద్రోహం చేసే సాహసం చేస్తుందా?.
దేవులపల్లి అమర్