International
పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం. అంపైర్ తలకి తీవ్ర గాయం..

దుబాయ్: ఆసియా (Asia Cup) కప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేయడం.. నిన్న యుఎఇతో జరిగే మ్యాచ్‌ని తొలుత బాయ్‌కాట్ చేయడం.. ఆ తర్వాత గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్‌లో […]
రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని

అమరావతి: ఎపి మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. 2007లో ఎండోమెంట్ కమిషన్ వారు 130 మంది ఆక్షన్ లో పాల్గొన్నారని, 130 మంది ఆక్షన్ లో పాల్గొంటే తాను భూమి ఎలా కొట్టేస్తాను? అని నిలదీశారు. 130 మందిలో 30వ వ్యక్తి మంత్రి గారి మనిషిని తానే కొనేస్తానా? అని రియల్ […]
కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని విద్యార్థుల ఆందోళన చేపట్టారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు ధర్నా చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి నేత సాయి, సిఐ నల్లప్పకు స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పిపిపి మోడల్‌లో టెండర్లకు […]
ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ – రానున్న 3 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన..! ఎల్లో హెచ్చరికలు జారీ
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్నిప్రమాదం

తిరుపతి జిల్లాలో రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ లో ఈ ప్రమాదం సంభవించింది. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
‘కల్కి’ నుంచి దీపికా ఔట్.. కారణాలు ఏంటో మరీ..

నటి దీపికా పదుకొనేను మరో ప్రతిష్టాత్మక సినిమా నుంచి తప్పించారు. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ తదితర అంశాల్లో దీపికా పెట్టిన కండీషన్ల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రం సీక్వెల్ నుంచి కూడా దీపికాను తొలగించారు. […]
జ్యూస్ తాగుతూ గుండెపోటుతో యువకుడు మృతి

రంగారెడ్డి: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. జ్యూస్ తాగుతుండగా యువకుడు(32) కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. యువకులలో గుండె జబ్బులు పెరగడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుక్త వయసులో గుండె జబ్బులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Also Read: గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి.. ఎందుకు? ఏమిటి? ఎలా? 60% ప్రజలు మన భారతదేశంలో డయాబెటిస్ […]
మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు : కొల్లు రవీంద్ర

అమరావతి: గత వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరపరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సిలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైసిపి చెప్పడం సిగ్గు చేటని, […]
ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓట్లను తొలగించారు: రాహుల్

ఢిల్లీ: మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్నాటకలోనూ ఓట్లను తొలగించారని, కర్నాటక ఎన్నికల్లో 6800 ఓట్లు తొలగించారని, లింక్‌డ్ మొబైల్ నెంబర్లన్నీ తప్పుడు నెంబర్లేనని తెలియజేశారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని, ఓట్ల తొలగింపుపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, […]