International
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సలైట్ మృతి

తొమ్మిది సంఘటనల్లో కావలసిన మహిళా నక్సలైట్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం ఎన్‌కౌంటర్‌లో హతమైంది. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గడిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్డి, పెర్మా పారా గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండపై ఉదయం కాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డిఆర్‌జి) బృందం సోదా ఆపరేషన్ కోసం బయలుదేరిందని ఇక్కడి అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందాక […]
సెంట్రల్ సాఫ్ట్ వేర్ వాడి ఓటర్లపేర్లు తొలగించారు: రాహుల్ గాంధీ

కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న బలమైన నియోజకవర్గాలలో ఓటర్లను మూకుమ్మడిగా తొలగించారని ఆరోపించారు. ఇందుకు సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేంద్రీకృత పద్ధతులలో దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ ఓటరు ఐడీలను వేరే రాష్ట్రాలలో నుంచి, నకిలీ లాగిన్ లు, ఫోన్ నెంబర్ లను ఉపయోగించి కుట్రపూరితంగా తొలగించారని రాహుల్ […]
వైజాగ్ టు హైదరాబాద్…! ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం, వెంటనే ల్యాండింగ్..!
శబరిమలలో బంగారం మాయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి బంగారాన్ని కొందరు దుండగులు మాయం చేశారు. ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఆలయంలో ప్రస్తుతం 4.5 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. రూ.5 కోట్లు విలువ చేసే బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ దేవస్థానమ్ బోర్డు (టిడిబి) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు […]
ఆ దేశంలో టి-20 సిరీస్.. విండీస్‌కి కొత్త కెప్టెన్

వెస్టిండీస్ (West Indies) జట్టు త్వరలో నేపాల్‌తో టి-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టును వెండీస్ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయి హోప్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో అకీల్ హొసేన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. షార్జా వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టి-20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తమ జట్టును వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. షాయి […]
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో పలు విమానాలు పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే విమాన రెక్కలలో ఓ పక్షి ఇరుక్కుపోయింది. పక్షి ఇరుక్కోవడంతో విమాన ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బ తిన్నాయి. ఇది గమనించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ […]
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ – 2025 : థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు తేదీ మార్పు – ఇదిగో తాజా అప్డేట్
జిఎస్టి అమలు గేమ్ ఛేంజర్ గా మారింది: చంద్రబాబు

అమరావతి: జిఎస్టి సంస్కరణలు.. పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో సిఎస్టి, వ్యాట్ వంటి పన్నుల విధానం ఉండేదని అన్నారు. జిఎస్టి సంస్కరణలపై ఎపి శాసన సభలో చర్చ జరిగింది. ఈ సభలో సిఎం మాట్లాడుతూ..గతంలో 17 రకాల పన్నులు, 13 రకాల సర్ ఛార్జ్ లు ఉండేవని, వాజ్ పేయీ హయంలో జిఎస్టి సంస్కరణలు తీసుకువచ్చారని తెలియజేశారు. అందరినీ ఒప్పించి అరుణ్ జైట్లీ జిఎస్టి సంస్కరణలను అమలు చేశారని, […]
రాహుల్ ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం: ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ వాడి ఓట్లను తొలగించారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవమని పేర్కొంది. అన్‌లైన్ వేదికగా ఓట్లను తొలగించడం అసాధ్యమని వెల్లడించింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓట్లు తొలగించలేదని.. ఆన్‌లైన్‌లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది. ‘‘2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. […]