International
స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందులో ఓబిసిలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్‌లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ‘విద్యలో ముందంజ’లో కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు అవలంభిస్తున్న సిఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం త […]
మా నమ్మకం నిజమైంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకులు, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “దాదాపు మూడేళ్ళ ప్రయాణం ‘ఓజీ’. ఈ కథకి ఇంతటి భారీతనం […]
సోల్ ఆఫ్ జటాధర

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్ -ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో తెరకెక్కుతున్న జటాధర నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. మేకర్స్ తాజాగా ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ను విడుదల చేశారు. సాంప్రదాయ సంగీతం, ఆధ్యాత్మిక టచ్ […]
మరో మారుతీ సుజుకీ వెహికిల్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్! ఈ 7 సీటర్ కారులోని భద్రతా ఫీచర్స్ ఇవే..
మెట్రో ఇక సర్కారీ

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించడంలో భాగంగా మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడి సెక్రటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, […]
ఉపాధ్యాయులకు టెట్ ని‘బంధనలు’

వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీర్పు. విద్యా హక్కు చట్టం- 2009 సెక్షన్ 23(1) ఆధారంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) 23-ఆగస్టు, -2010 నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసింది. టెట్ అంశం పై ‘అంజుమన్ ఇషాత్-ఎ-తలీమ్ ట్రస్ట్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర & ఆర్శ్’ కేసు విషయంలో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఉపాధ్యాయులుగా నియమించబడ్డ […]
భారతీయుల భవిష్యత్తుపై హెచ్1బి ప్రభావం

అమెరికాలో ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించడానికి ప్రధాన ద్వారంగా ఉన్న హెచ్-1బి వీసా, భారతీయ యువతకు గ్లోబల్ అవకాశాల కోసం అనేక సంవత్సరాలుగా ప్రధాన మార్గంగా ఉంది. 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ వీసా ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్య, పరిశోధన రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్-1బి వీసాలను జారీ చేస్తున్నారు. అందులో 65,000 సాధారణ వర్గానికి, 20,000 […]
పండుగ తరువాత కెటిఆర్ అరెస్టు!

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కెటిఆర్ అరెస్ట్ తప్పదని, పండుగ తర్వాత అరెస్టు ఉండే అవకాశం ఉందని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి కెసిఆర్, కెటిఆర్‌లు ఎన్నికల్లో గెలిచారని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసిసి పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం […]
బాలయ్య వర్సెస్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి గట్టిగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల ధరల పెంపు, చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వ హయాంలో ఏపి సిఎం వైఎస్ జగన్‌ను చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల బృందం కలిసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగడం విశేషం. ఏపి అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ […]