International
మునిగిన ఎంజిబిఎస్.. సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్: మూసీ సదికి భారీ వరద కారణంగా ఎంజిబిఎస్ ప్రాంగణంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆర్టిసి ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రయాణికులకు సూచనలు ఇచ్చారు. ఎంజిబిఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని సజ్జనార్ తెలిపారు. ‘‘ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జెబిఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
పొరపాటున ఎవరైనా ప్రయాణికులు ఎంజిబిఎస్‌కు వస్తే.. వారిని తరలించేందుకు అవసరమైనన్నీ లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకూ ఎంజిబిఎస్‌కు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు.
పరిణితి లేకుండా అతడి బౌలింగ్ సాగింది: అశ్విన్
ఆసియాకప్‌లో భాగంగా జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్‌లో లంకపై భారత్ నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో ఒకేఒక్క వికెట్ తీసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. దీంతో అతని బౌలింగ్‌పై టీం ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ టెక్నిక్ సరిగ్గా లేదని అశ్విన్ అన్నాడు.
‘‘హర్షిత్‌కి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఇలా జట్టులోకి వస్తూ.. పోతూ ఉండటం వల్ల ఆత్మ విశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతి వేగంగా.. మరో బంతి నెమ్మదిగా వేశాడు. పరిణితి లేకుండా హర్షిత్ బౌలింగ్ సాగింది. ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశ్విన్ చురకలంటించాడు.
లడఖ్ లో అల్లర్లను రెచ్చగొట్టిన సోనమ్ వాంగ్ చుక్ కు పాక్ తో సంబంధాలు
హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సిఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో టూరిజం పాలసీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్‌కి సిఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు.
‘‘గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎకో, మెడికల్, హెల్త్, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో రక్షణ, శాంతి భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ.. ప్రపంచ సుందరీమణుల పోటీలను విజయవంతంగా నిర్వహించాం’’ అని సిఎం రేవంత్ అన్నారు.
బిసిల నోటికాడి ముద్ద లాగొద్దు: మంత్రి పొన్నం
పారా ఛాంపియన్‌షిప్‌లో.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్
గ్వాన్‌జూ: ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ శీతల్‌దేవీ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ వన్ ఓజ్‌నుర్ క్యూర్‌గిర్డీని 146-143 తేడాతో ఓడించి స్వర్ణపతకం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలోని గ్వాన్‌జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ ఘనత సాధించింది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.
అంతకు ముందు.. తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవీ కాంస్యం గెలుచుకుంది. మరోవైపు మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో సరితతో కలిసి ఆమె రజత పతాకంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో టర్కీకి చెందిన పారా ఆర్చర్ల చేతిలో వీళ్లు ఓడిపోయారు. జమ్ము కశ్మీర్‌కి చెందిన శీతల్ దేవి.. ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల చేతులు లేకుండానే జన్మించింది. అయినా ఆమె కుంగిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణాలు ప్రయోగించడం నేర్చుకొని భారత్ గర్వపడే ఆర్చర్‌గా నిలిచింది.
వరల్డ్ చాంపియన్ శీతల్ దేవి
రేవంత్ అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్‌ఎస్సే: హరీశ్
హైదరాబాద్: పర్యాటకాభివృద్ధి పేరిట కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని బిఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించి స్కామ్‌కు తెరలేపారని మండిపడ్డారు. హరీశ్ ఎక్స్ ఖాతాలో.. నిబంధనలకు విరుద్ధంగా రూ.15 వేల కో్ట్ల పనులు అప్పగించారని అన్నారు. లక్షల కోట్ల విలువైన భూములను ధారదత్తం చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. పనులను రహస్యంగా ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలు బయటపెడతామని తెలిపారు. ‘సిఎం రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్ఎస్ సర్కార్’ అని అన్నారు. ఈ దోపిడిలో భాగమైన ఏ ఒక్కరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.