International
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడతల్లో ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగన్నాయి. అక్టోబర్ 23, 27న ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. నవంబర్ 11న ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Maharashtra rains : మహారాష్ట్రలో వర్ష బీభత్సం- ముంబైలో అల్లకల్లోలం! 10 మంది మృతి..
న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ అండ.. తాజాగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే!
వైభవంగా శ్రీవారి గరుడసేవ
వరుణుని జల్లుల నడుమ ఘనంగా గరుడ సేవ
విజయ దశమి కానుకగా..
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. మంచికి-చెడుకి, వెలుగుకి-చీకటికి, మానవ సంకల్పానికి- విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఆడపడుచుల వేధింపులు… వివాహిత ఆత్మహత్య
సంగారెడ్డి: ఆస్తుల కోసం ఆడపడుచుల వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాపూర్ శివారులోని గీతానగర్ కాలనీలో మల్లిఖార్జున(35), దివ్యశ్రీ(32) అనే దంపతులు నివసిస్తున్నారు. మల్లిఖార్జున ఒక పరిశ్రమలో పని చేస్తుండగా దివ్యశ్రీ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా జాబ్ చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆడపడుచులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో దివ్యశ్రీ మానసికంగా ఆందోళనలు ఉన్నారు. ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చి భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో కన్నీంటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘కాంతార: చాప్టర్ 1’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి: ఎన్టీఆర్
రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. హోంబలే ఫిలమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కాంతార రిషబ్ శెట్టి డ్రీమ్ ఈ సినిమా. ఈ కలని నెరవేర్చడానికి హోంబలే ఫిలమ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్‌గా ఈ చిత్రం నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ రుక్మిణి వసంత్ తదితరులు పాల్గొన్నారు.
సొంత నిర్మాణ సంస్థలో ‘సరస్వతి’
వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా, దర్శకురాలిగా మారుతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్‌ని ప్రారంభిస్తున్నారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ’సరస్వతి’ టైటిల్ తో ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను ప్రకటించారు. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నాడు.
రైతు ప్రాణం తీసిన కోతులు
రాజన్నసిరిసిల్ల: ఇంటిపై ఉన్న కోతులను తరిమి క్రమంలో ఓ రైతు కిందపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిపైకి కోతులు రావడంతో వాటిని వెళ్లగొడుతుండగా అవి ఆయన పైకి దూసకరావడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సద్దుల బతుకమ్మ రోజు రైతు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. కోతుల బెడదకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.