International
పైరసీపై యుద్ధం.. ఐబొమ్మ సంచలన ప్రకటన..
సినిమాలు, ఒటిటి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు.. సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఐబొమ్మ వెబ్‌సైట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్న గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్‌సైట్ తెలుగులో ఓ ప్రకటనను వెలువరించింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీ ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీని వల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్య తరగతివాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్‌లో మూవీలను రికార్డు చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్‌సైట్లపై దృష్టి పెట్టాలని సూచించింది. తాము ఏ దేశంలో ఉన్న భారత దేశం, అందులోనూ తెలుగు వారి గురించి ఆలోచిస్తామంటూ చెప్పింది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
వినాయకుడిపై ఒట్టు.. ‘మాస్ జాతర’ వచ్చేది అప్పుడే..
మాస్ మహరాజ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా ఓ ఫన్నీ వీడియోతో ఈ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ వీడియోలో రవితేజను హైపర్ ఆది సినిమా విడుదల తేదీ గురించి పలు మార్లు అడగటం.. దానికి రవితేజ సమాధానం చెప్పడం చూడొచ్చు. ఆఖరిగా వినాయక చవితి కూడా అయిపోయింది అంటూ వినాయకుడి విగ్రహంతో ఆది వస్తాడు.. అయితే ఆ వినాయకుడిపై ప్రమాణం చేస్తూ.. అక్టోబర్ 31వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు రవితేజా ప్రకటిస్తాడు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ‘మాస్ జాతర’ సినిమా చెప్పిన టైమ్‌కి విడుదలై.. ప్రేక్షకులకు జాతర చూపించాలని కోరుకుంటున్నారు.
శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం
కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్, ప్రియాన్ష్ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో శ్రేయస్ 110, ప్రియాన్ష్ 101 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (56), రియాన్ పరాగ్ (67), బదోని (60) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలింగ్‌లో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలో వికెట్ తీశారు.
పెళ్లి పీటలు ఎక్కనున్న తెలుగు హీరో.. అధికారిక ప్రకటన
హైదరాబాద్: అల్లు వాళ్లింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ‘మా తాతగారు అల్లు రామలింగయ్య పుట్టిన రోజున నా హృదయానికి ఎంతో చేరువైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31వ తేదీన నాకు నయనిక అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుగనుంది. ఈ మధ్యే మరణించిన మా నాన్నమ్మ నాకు పెళ్లి చేయాలని ఎప్పుడు కోరుకునేది. నా మా మధ్య లేకపోయినా.. మా ఈ కొత్త ప్రయాణంలో ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా’’ అని శిరీష్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
శిరీష్ వివాహం గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అయితే శిరీష్ ఎంగేజ్‌మెంట్ చేసుకొనే నయనిక గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘జటాధర’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్.. సోనాక్షి చించేసింది..
ఈ మధ్యకాలంలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో సుదీర్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన ఓ పాన్ ఇండియా సినిమాతో తన భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. ఆ సినిమానే ‘జటాధర’. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు అన్ని అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి’ అనే పవర్‌ఫుల్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సాహితి చాగంటి పాడగా.. శ్రీహర్ష సాహిత్యం అందించారు. ఈఇక ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు.
ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ సంయుక్తి సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది.
వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు
పింఛన్ ను పది రెట్లు పెంచిన ఘనత టిడిపిది : చంద్రబాబు
అమరావతి: పేదవాళ్ల కోసం అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ ఐటి హబ్ గా మారబోతుందని అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ప్రజావేదిక సభలో సిఎం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రూ. 2 వేల కోట్లు ఖర్చుపెట్టి వందశాతం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని రూ.11,400 కోట్లు ఇప్పించామని తెలియజేశారు. ప్రపంచస్థాయి కంపెనీలు విశాఖకు తరలివస్తాయని, 10, 579 మందికి వితంతు పింఛన్లు ఇచ్చామని చెప్పారు. ప్రతి నెలా ఒకటినే పింఛన్ల పండుగ చేసుకుంటున్నామని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు.
ఈ 16 నెలల్లో పేదలకు రూ. 48,019 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతంలో ఒక నెల తీసుకోకపోతే ఇచ్చేవాళ్లు కాదని.. ఇప్పుడు తర్వాత నెలలో కూడా తీసుకోవచ్చునని తెలిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే అవకాశం ఇస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. పింఛన్ సొమ్మును పది రెట్లు పెంచిన ఘనత టిడిపిది అని కొనియాడారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ప్రతినె లా ఒక గ్రామానికి నేరుగా వచ్చి తానే పర్యవేక్షిస్తున్నానని, 2 కోట్ల 66 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, రూ. 1,718 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఆగష్టు 15న స్త్రీశక్తి పథకం తీసుకొచ్చామని, ఒకప్పుడు పది లక్షల మందే బస్సులు ఎక్కేవారని.. ఇప్పుడు డబుల్ అయిందని ప్రశంసించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ఉద్దేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తొలి టెస్ట్‌కి బుమ్రా దూరం? గిల్ ఏమన్నాడంటే..
భారత్, వెస్టిండీస్‌ల మధ్య గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. యువ సంచలనం శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో టీం ఇండియా ఆడుతున్న రెండో సిరీస్ ఇది. అది కూడా స్వదేశంలో జరుగుతోంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టెస్ట్‌కి ముందు భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని సోషల్‌మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘‘జట్టు కాంబినేషన్‌పై మ్యాచ్ టు మ్యాచ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. గేమ్ ఎంతసూసే సాగుతుంది.. ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేస్తాము. కానీ, ముందుగా ఎలాంటి నిర్ణయము తీసుకోము’’ అని గిల్ తెలిపాడు.