International
మరోసారి మా జోలికి వస్తే దెబ్బకు దెబ్బే.. పాక్ మంత్రి హెచ్చరికలు
కుండపోత వర్షాలు.. డార్జిలింగ్ లో 20 మంది మృతి
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ!
కారు కోసం సెర్చ్ చేసి.. డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు..
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేసేందకు కొత్త మార్గాలు తయారు చేస్తున్నారు. రకరకాలుగా కుట్రలు పన్ని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కారు అద్దెకు తీసుకొనేందుకు ప్రయత్నించి డబ్బులు పొగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లాలాగూడకు చెందిన ఓ వ్యక్తి కోయంబత్తూరులో కారు అద్దెకు తీసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేశాడు. శివశక్తి కార్ రెంటల్స్ అనే పేరు చూసి.. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌ని సంప్రదించాడు.
రిజిస్ట్రేషన్ కింద రూ.149 చెల్లించాలని, ఎపికె ఫైల్ పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అది నిజమేనని నమ్మిన బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకొని రూ.149 చెల్లించాడు. ఎపికె ఫైల్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవడంతో అందులోని మాల్వేర్ ద్వారా ఒటిపిలు రాకుండా సైబర్ మాయగాళ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. దీంతో అతని ఖాతాలోని రూ.1.98 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్య..కాంగ్రెస్ సర్కార్ పై కెటిఆర్ ఫైర్
విశాఖలో పెను విషాదం.. బీచ్‌లో ఇటలీ పర్యాటకుడు మృతి
రెండో అతి పెద్ద దేవాలయంగా శ్రీశైలం అభివృద్ధి
సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..
ముగిసిన భారత్ బ్యాటింగ్.. పాకిస్థాన్ లక్ష్యం ఎంతంటే..
కొలంబో: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత మహిళ జట్టు, పాకిస్థాన్ మహిళ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. ఈ క్రమంలో భారత బ్యాటర్లు పాక్ బౌలర్ల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. పాక్ బౌలర్లు భారత బ్యాటర్ల వికెట్లు తీస్తూ స్కోర్‌ని కట్టడి చేశారు. ముఖ్యంగా పాక్ బౌలర్ డయానా బైగ్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో హర్లిన్ డియోల్ 46, రిచా ఘోష్ 35, జెమిమా రోడ్రిక్స్ 32, ప్రతీక రావల్ 31 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్‌లో డయానా 4, ఇక్బాల్, సనా చెరి రెండు, షమీమ్, నంధు తలో వికెట్ తీశారు.