kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetbox

అడ్లూరి నన్ను టార్గెట్ చేస్తున్నారు: మంత్రి వివేక్

అడ్లూరి నన్ను టార్గెట్ చేస్తున్నారు

ఆయనకు టికెట్ ఇప్పించిందే వెంకటస్వామి

మాలల ఐక్యవేదికలో కార్మిక మంత్రి వివేక్ వ్యాఖ్య

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: తాను మాల జాతికి చెందిన వాడినని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను విమర్శిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మాలల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా తనకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కు కుళ్లు అని వ్యాఖ్యానించారు. అక్కడ మొదట కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండేదని, కానీ తాను ఇన్‌ఛార్జి అయ్యాక ఇప్పుడు సానుకూలంగా మారిందన్నారు. కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నారని, మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదని, కానీ మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదన్నారు. తననే ఎందుకు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి వ్యాఖ్యలపై వివేక్ మండిపడ్డారు. లక్ష్మణ్‌కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే కాకా వెంకటస్వామి అని, ఈ విషయం మరిచిపోతున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో అడ్లూరి తనను లక్షంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలల అభివృద్ధ్ది కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. రోస్టల్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కొందరు మాల జాతిని కించపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టాలంటే ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాలల రిజర్వేషన్ పెరిగేలా కృషిచేస్తాని అన్నారు. మాలలు ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని అన్నారు. తన తండ్రి జయంతి వేడుకలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సమావేశంలో పాల్గొన్న వర్దన్నపేట ఎంఎల్‌ఎ నాగరాజు అన్నారు. తాను జిల్లాలో సిపిగా పనిచేసే సమయంలో అందరూ సహకరించారని గుర్తు చేశారు. కాగా, రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతోందని, దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1, 2 ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సన్మానించారు. 

సోమవారం రాశి ఫలాలు (13-10-2025)

మేషం – పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు.

వృషభం – వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు.కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది.

మిథునం – వృత్తి- ఉద్యోగాలపరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలలో కొంత మార్పు కోరుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగినది.

సింహం – సంతానం చేపట్టిన పనులలో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి.

 

కన్య – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అయినవారి అండదండలు మీకు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది.

తుల – ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు. పదే పదే పదుగురి సలహాలు తీసుకుంటారు కానీ మీకు తోచినదే చేస్తారు.

వృశ్చికం – జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన క్షేమం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తి ఉద్యోగములకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు.

ధనుస్సు – ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్నిపరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ నిర్లక్ష్యం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుంది.

మకరం – ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు.

కుంభం – మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములలో నైపుణ్యమును ఆసక్తిని చూపిస్తారు. సహచరులలో ఒకరు మీ సన్నిహితులు అవుతారు.

మీనం – ఏ పని నైనా సరే పూర్తికానంతవరకు బహిర్గతం చేయకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. లీజులు లైసెన్సులను తిరిగి పొందడానికి గాను చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్‌‌‌‌ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో అంబులెన్స్ సైతం చిక్కుకు పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.

ప్రపంచకప్‌: భారత్ పై ఆస్ట్రేలియా రికార్డు విజయం

విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో ఓవర్ మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది మూడో విజయం కావడం విశేషం.

ఇక టీమిండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, లిఛ్‌పిల్డ్‌లు శుభారంభం అందించారు. లిచ్‌ఫిల్డ్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 40 పరుగులు చేసింది. అష్లే గార్డ్‌నర్ (45), ఎలిసె పేరి 47 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతీక రావల్ (75), స్మృతి మంధాన (80) అండగా నిలిచారు.

ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా

తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. పర్శురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ- హబ్, టీ- వర్క్ పాత్ర కీలకమని కొనియాడారు. సిరిసిల్లకు చెందిన పర్శురామ్ పాక మన ఇంక్యుబేటర్ల (టి హబ్, టి వర్క్) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్‌ను స్థాపించారని తెలిపారు. నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్‌ను పూర్తిగా దేశీయంగా రూపొందించి, తయారు చేసిందని తెలిపారు. ఇది నిజమైన మేడ్- ఇన్ -ఇండియా, మేడ్ -ఫర్- ది -వరల్డ్ విజయగాథ అని కెటిఆర్ అభివర్ణించారు.

కే2కే ప్రపంచ రికార్డ్, అంతర్జాతీయ విస్తరణ

గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్ -టు -కన్యాకుమారి(కె2కె) రైడ్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని అన్నారు. శుక్రవారం కోయంబత్తూరులో పర్శురామ్ పాకను కలిశానని, ఆయన కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని తెలిపారు. ఇది తనకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్ అని వ్యాఖ్యానించారు.

పర్శురామ్, గ్రావ్టన్ మోటార్స్ ఈవీ బృందానికి అభినందనలు తెలుపుతూ, ఆయన కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణల వ్యవస్థ స్థానిక మేధస్సును అంతర్జాతీయ ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ఎలా ముందుకు నడిపిస్తోందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు..!

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయి. భారత్‌లో ఎఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ అంచనాలను వెల్లడించింది. 2030 నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే భారత్‌లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా టెక్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలను ఎఐ సృష్టించబోతున్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రమణ్యం ఈ వివరాలు వెల్లడించారు. నాస్కామ్ బిసిజితో కలిసి ఈ నివేదిక తయారు చేసింది. 2035 నాటికి భారత్ ఎఐ రంగంలో గ్లోబల్ హబ్ గా మారబోతోందని ఈ నివేదికలో తెలిపారు. ఎఐ దూకుడు కారణంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు, లెవెల్ 1 సపోర్టింగ్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఎఐ నైపుణ్యాల వృద్ధి, ఆవిష్కర ణలు జరగకపోతే ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇవి జరిగితే మాత్రం జాతీయ స్ధాయిలో ఆయా ఉద్యోగులు ఆస్తులుగా మార తారని తెలిపింది. ఎఐ దూకుడు కారణంగా టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెనుమార్పులు తథ్యమని చెబుతోంది. ఏఐ కారణంగా ఎఐ

ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల రాక పెరగనుందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. వీటితో పాటు కొత్త ఉద్యోగాలైన ఎఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఎఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఎఐ ట్రైనర్స్, ఎఐ ప్రొడక్ట్ మేనేజర్స్, ఎఐ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ స్పెషలిస్ట్, ఎఐ లిటరసీ ట్రైనర్స్, స్పెషలిస్ట్, ఎఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ వంటివి కూడా రాబోతున్నట్లు వెల్లడించింది.

చీరాల బీచ్ లో విషాదం.. ముగ్గురి మృతి, ఇద్దరు గల్లంతు

మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్‌లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శ కులు సూర్యలంక బీచ్‌తో పాటు వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు.

ఈ క్రమలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ సాయి, మణిద్వీప్, జీవన్ సాత్విక్‌లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపా డేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్, మణిదీప్‌ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్‌తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్నిమాపక, మత్సశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని బాపట్ల ఎస్పీ ఉమా మహేశ్వర్ పరిశీలించారు.

మంగినపూడి బీచ్ వద్ద యువకులను కాపాడిన మెరైన్ సిబ్బంది..

ఇదిలా ఉండగా, బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ వద్ద నీళ్లలో కొట్టుకుపోతున్న నలుగురు యువకుల్ని పోలీసులు, మెరైన్ సిబ్బంది రక్షించారు. ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో మంగినపూడి బీచ్ రద్దీతో కిటికీటలాడుతోంది. సముద్ర తీరా ప్రాంతంలో అలల తాకిడికి కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో నలుగురు యువకుల్ని కాపాడారు. అబ్దుల్ అసిఫ్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్, ఎండి అన్వర్, అనే యువకులను మెరైన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడి నందుకు యువకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన ధైర్యసాహసాలను పర్యా టకులు ప్రశంసించారు.

స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌‌ను ప్రారంభించిన చంద్రబాబు!

నకిలీ మద్యం కేసులో షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.

మద్యం షాపులకు దరఖాస్తుల జోష్..

రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 5663 దరఖాస్తులు

ఈనెల 18 వరకే గడువు 

మిగిలింది వారం రోజులే.. చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే చాన్స్

ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం షాపులకు దరఖాస్తుల జోష్ కొనసాగుతోందని ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు శనివారం సాయంత్రం వరకు 5663 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో దరఖాస్తుల స్వీకరణ అంకం పూర్తి కానుందని, చివరి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనావేస్తున్నామన్నారు. గత రెండేళ్ల క్రితం సైతం చివరి రెండు రోజుల్లో 45 వేల నుంచి 50వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఈసారి చివరి మూడు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయని, సోమవారం నుంచి శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అంచనాలు ఉండడంతో ఎక్సైజ్ డివిజన్ల వారిగా, రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్ల లో ను, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లు ఏర్పాటుతోపాటు దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. గత రెండేళ్ల క్రితం మద్యం షాపులకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి దరఖాస్తులు గతంలో కంటే మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వేయడానికి మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుందన్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరోపక్క మద్యం షాపులకు కేటాయించిన రిజర్వేషన్లు గౌడ్, ఎస్సీ, ఎస్టీ మద్యం షాపులకు దరఖాస్తులు పోటాపోటీగా పడుతున్నాయని వెల్లడించారు. గౌడ షాపులకు 671 దరఖాస్తులు, ఎస్సి రిజర్వేషన్లు 202, ఎస్టి రిజర్వేషన్లు 84, జనరల్ లో 4686 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ లో 142, హైదరాబాదులో 746, కరీంనగర్‌లో 392, ఖమ్మంలో 260, మహబూబ్ నగర్‌లో 278, నల్లగొండలో 568, మెదక్‌లో 411, నిజామాబాద్‌లో 255, రంగారెడ్డిలో 2353, వరంగల్లో 258 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

బిసి రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బిసి జెఎసి ఏర్పాటు

చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్

ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్

13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా

తెలంగాణ బంధ్ తో బిసిల బలమేంటో చూపిస్తాం

బిసిల నిరసనను గల్లి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం

ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బిసి ఐక్య కార్యాచరణ కమిటీ (బిసి జెఎసి) ఏర్పాటయ్యింది. ఆదివారం హైదరాబాద్, లక్డీకాపూల్ లోని ఓ హోటల్‌లో బిసి సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడంతో ఉద్యమించే బిసి సంఘాలు తమ తమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో జెఎసి ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బిసి జెఎసి చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ లు గా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణ ను ఎన్నుకున్నారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈనెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ సందర్భంగా జెఎసి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బిసిలకు అన్యాయం చేసిందని, ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బిసిలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తాయని అన్నారు. ప్రస్తుత బిసి రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 14న నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర బందును 18కి వాయిదా వేశామని 18న జరిగే బందును పార్టీలకతంగా బిసిలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బిసిలు ఐక్యంగా లేరని బిసిలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టియడానికి బిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బిసి సంఘాలను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని బిసి జెఎసిగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈనెల 18న జరిగే బంద్ ద్వారా బిసిల బలమేందో, బిసిల శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు బిసిల ఐక్యత ద్వారా తెలంగాణలోని బిసి సమాజానికి విశ్వాసం కల్పించి పార్టీలుగా సంఘాలుగా విడిపోయిన బిసి శ్రేణులను ఒక్కటి చేసి తెలంగాణలో బిసిల రాజకీయ అధికారానికి పునాదులు వేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో 40 బిసి సంఘాలు, 110 బిసి కుల సంఘాలతో పాటు ముఖ్యంగా బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రం గౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపేష్ సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్లయ్య, రాజేందర్, పగిల సతీష్, రామ్మూర్తి, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.