elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet giriş

అఫ్గాన్‌-పాక్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య తాజాగా సంఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఒప్పందంపై ప్రకటించింది. సానుకూల పరిష్కారం కోసం ఉభయ దేశాలు విశ్వసనీయమైన ప్రయత్నాలు చేయడానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల దౌత్యపరమైన చర్చలకు వీలవడమే కాక, తదుపరి ప్రాణనష్టం జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని పాక్ విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

త్వరలో వందేభారత్ 4.0: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ : భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు. సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మాట్లాడారు.

మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సాధించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్‌వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కిమీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు. 

ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం: కేంద్రం

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం సరెండర్ తరువాత బుధవారం ఈ స్పందన వెలువడింది. ఇప్పుడు కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సల్స్ ఉనికి ఉందని ప్రకటనలో తెలిపారు. ఎల్‌డబ్లుఇ కథ ముగిసేదశకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. నక్సల్స్ రహిత భారత్ రూపొందించాలనే మోడీ ప్రభుత్వ విజన్ దిశలో ఇది భారీ ముందడుగు అని, తమ 2026 లక్షం ముందే దీనిని చేరుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో తాము 2026 మార్చి 31కు ముందే అనుకున్న లక్షం చేరుకుంటామని ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 కేడర్స్ నిర్మూలన జరిగింది. ఇందులో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి, 8 మంది వరకూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపుగా 836 మంది అరెస్టు అయ్యారు. 1639 మంది సరెండర్ అయ్యారని లెక్కలు తెలిపారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటుతో ఇది కీలకమ లుపు తిరిగిందన్నారు.

భూపతి సరెండర్‌తో సరికొత్త అధ్యాయం: ఫడ్నవిస్

మల్లోజుల సరెండర్, వెంట భారీ స్థాయిలో నక్సల్స్ లొంగుబాట కీలక పరిణామం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం తెలిపారు. ఈ పరిణామంతో మహారాష్ట్రలో నక్సల్స్ కదలికలు ఉండబోవని ఆయన విశ్లేషించారు. ఇక కొద్దిరోజుల్లోనే చత్తీస్‌గఢ్, తెలంగాణాల్లోని మొత్తం ఈ ఎర్ర ప్రాంగణం లేదా రెడ్ కారిడార్ కథ కంచికి అని వ్యాఖ్యానించారు. నిషేథిత వర్గాలపై పోరులో తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రధాన పాత్ర వహించడం తమ ప్రాంతానికి గర్వకారణం అని కూడా తెలిపారు.

జనజీవన స్రవంతిలోకి వచ్చే నక్సల్స్‌కు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆశ్రమం, పునరావాసం కల్పిస్తాయని, నాయకత్వం లేని తమ ఉద్యమం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకి రావాలని కూడా ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. సీనియర్ మావోయిస్టు నేత భూపతి తమ దళం సభ్యులు దాదాపుగా 60 మందితో కలిసి బుధవారం మహారాష్ట్ర సిఎం ముందు లొంగిపోయారు. ఈ దశలో ఏర్పాటు అయిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ ముందు నక్సల్స్ లొంగిపోయారని, వారికి చెందిన ఎకె 47లు ఇతర మొత్తం 54 మారణాయుధాలను స్వాధీనపర్చుకున్నామని ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దేశంలో నక్సలిజం పూర్తి స్థాయి అంతానికి తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆరంభం జరిగిందని, ఇది దేశ చరిత్రలో మైలురాయి అవుతుందని ఫడ్నవిస్ గర్వగా తెలిపారు. ఇప్పుడు ఇక చత్తీస్‌గఢ్, కొంతలో కొంత తెలంగాణలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కేవలం వారి ఉనికి పరిమితం అయింది. ఇది కూడా అంతరిస్తుందన్నారు. ఇది పోలీసు, భద్రతా సిబ్బంది, ప్రత్యేకించి ఇంటలిజెన్స్ వర్గాల ఘనత అన్నారు. 

పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం

సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం

చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు

గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్లుజి) వ్యవస్థాపక సభ్యుల కేడర్‌లోని వాడు. నక్సల్స్ ఉద్యమానికి కీలక వ్యూహకర్త. దశాబ్దాలుగా మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ సరిహద్దులలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో ప్రధాన భూమిక వహించాడు. ఆయన ప్రభావం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో కూడా నక్సలైట్ల ఉద్యమంపై బలీయంగానే ఉంది. ఆయనను పట్టిస్తే రూ 6 కోట్ల నజారానాను ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకాలం రెండురోజుల క్రితం వరకూ దట్టమైన అరణ్యంలో దళాల మధ్య నాయకత్వంతో గడిపి, సాయుధ పోరాటమే జీవితం అని నిర్ధేశితంగా గడిపిన వ్యక్తి ఇప్పుడు తనతో పాటు 60 మంది నక్సల్స్‌తో సహా పోలీసులకు లొంగిపొయ్యారు. ఇప్పుడు గడ్చిరోలి పోలీసు కస్టడీకి తరలివెళ్లారు.

నక్సల్ సమస్య లేకుండా చేస్తామనే కేంద్ర ప్రభుత్వ, ప్రత్యేకించి హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల క్రమంలో నెలరోజులుగా తెరవెనుక సాగిన మంతనాలు, క్షేత్రస్థాయిలో పరిణామాల నేపథ్యంలో ఇక మరో మార్గం లేదని గుర్తించే మల్లోజుల సరెండర్ అయ్యాడా? లేక మరేదైనా వ్యూహాత్మక అంశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 69 సంవత్సరాల ఈ భూపతి మావోయిస్టుల సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా. ఆయన తన బృందంతో సరెండర్ కావడం, ఇప్పుడు సాగుతున్న నక్సల్ బలహీనత సంకేతాలకు ప్రధాన అంశం అయింది .ఒక ధైర్యసాహసాల తుపాకీ యోధుడి కోణం, ఇప్పుడు అటువంటి వ్యక్తిలో నెలకొన్న ఆత్మనూన్యత భావం, క్రమేపీ రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం సరెండర్‌కు దారితీసిందని ఈ విషయాలపై అవగావహన గల సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

గత నెలలోనే ఆయన వామపక్ష తీవ్రవాదం తన చివరి దశలో ఉందనే విషయం గుర్తించాడని ఈ అధికారి పేరు చెప్పకుండా తెలిపారు. తాను సరెండర్ అవుతానని, తనతో కలిసి లొంగిపోయే వారు కలిసి రావచ్చునని చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా కరపత్రాలు సందేశాలు, చివరికి ప్రెస్‌నోట్లు వెలువరించిన విషయాన్ని ఈ పోలీసు అధికారి గుర్తు చేశారు. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజులకు కేడర్‌లో అనేక మారుపేర్లు ఉన్నాయి. సోనూ , అభయ్,వ వివేక్‌గా కూడా పేరుమోశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి మల్లోజుల వెంకటయ్య నుంచి స్ఫూర్తి పొందే కొడుకు ఈ అడవిబాట పట్టినట్లు , ఎన్నో ఏళ్లుగా తన ఊరివారికి కూడా అజ్ఞాతుడై, అడవిచుక్క అయ్యాడని కరీంనగర్ వ్యక్తి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది ఆరంభంలోనే భార్య తారక్క సరెండర్

తనతో పాటు కేడర్‌లో పనిచేసిన భూపతి భార్య తారక్క ఈ ఏడాది ఆరంభంలోనే సరెండర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇక ఆయన సరెండర్ సూచనలు బలోపేతం అయ్యాయి. సాయుధ పోరాటం అనేది ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడిందని, ఇప్పుడు ఈ విప్లవ సిద్ధాంత విఫల అధ్యాయం అని ఆయన తరచూ భావించారని, ఈ మేరకు తమకు నిర్థిష్ట సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఏం చేయగలం? ఏం సాధిస్తాం? ఏం సాధించామనే ఆలోచనలు ఆయనలో మిక్కుటం అయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన సరెండర్ నిర్ణయానికి దారితీశాయి. ముందుగా భార్యను జనజీవితంలోకి పంపించాడని, ఇప్పుడు తాను సరెండర్ అయ్యాడని, ఇది కీలక పరిణామమే అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

సరెండర్ సంకేతాలు రాగానే ఆయన డోలాయమాన పిరిస్థితిని పసిగట్టామని, దీనితో ఇక ఆయన కోసం గాలించకుండా , మర్యాదపూర్వకంగా సరెండర్ అయ్యేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని,ఈ మేరకు తమ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని పోలీసు బాస్ వెల్లడించారు. ఈ దిశలో నమ్మకస్తులైన వారి ద్వారా ముందుగా ఆయననుఏ భమార్‌గఢ్ ప్రాంతంలో సంప్రదించడం జరిగిందని వివరించారు. ఇంతకాలం చట్టానికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చట్టం ముందు లొంగిపోతే ఇకపై ఎటువంటి ముప్పు ఉండకుండా చూస్తామనే భద్రతను క్రమేపీ కల్పించామని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లొంగుబాటు జరిగిందని వివరించారు.

10 రోజుల క్రితమే పల్లెజనం ముందు వెల్లడి

పదిరోజుల క్రితమే భూపతి కొందరు నక్సల్స్‌తో కలిసి ఫోడేవాడా ప్రాంతంలో గ్రామస్తులతో ముచ్చటించి వెళ్లారు. ఇక తాను అడవుల్లో నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చిందని చెప్పినట్లు తమకు రూఢిగా తెలిసిందని వివరించారు. ఇంతకాలపు హింసాత్మక మార్గాన్ని వీడి ఇప్పుడు తమ ముందుకు వచ్చాడని పోలీసు అధికారి చెప్పారు. దీనితో 40 సంవత్సరాల ఆయన ఈ సుదీర్ఘ ప్రస్థానం ముగిసిందని ఆయన గురించి తెలిసిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఈ నెల 13వ తేదీన తెరవెనుక మంతనాలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నేతతో ఓ పోలీసు అధికారి కలిశారు. అంతకు ముందు చాలా కాలంగా భూపతి కదలికలను గమనిస్తూ, ఆయన సరెండర్‌కు యత్నించిన ఈ పోలీసు అధికారి అదే రోజు ఆయన సరెండర్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఆయన చెప్పినట్లే భామర్‌గఢ్ తాలూకలోని హోదారి కుగ్రామం వెలుపల ఆయన ఆయన భారీ బృందంతో సరెండర్ అయ్యారు. దీనితో ఇక నక్సల్స్ ఉద్యమంలో సంధ్యకాలం ఏర్పడింది.

ఈ భూపతి, తన నక్సల్స్ బృందంతో సరెండర్ అయిన తరువాత ప్రత్యేకించి ఇప్పుడు మిగిలిన వామపక్ష తీవ్రవాదం దిశ దశ దిక్సూచి ఏమిటనేది అటు నక్సల్స్, ఇటు పౌర సమాజం, మేధావుల్లో పలు ఆలోచనలకు దారితీసింది. ఈ భూపతి బృందం పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు ఆత్మసమర్ఫణకు దిగారు. ఈ క్రమంలో 54 ఆయుధాలు కూడా అప్పగించారు. సాయుధ పోరాట లక్షం గతితప్పిందనే మల్లోజుల మనోగతం తరువాతి క్రమంలో ఈ అడవిదారుల ఉద్యమ పంథా ఏమిటనేది అడవుల్లో చప్పుడు అయింది.

నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రెండు నామినేషన్ సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భారీ ర్యాలీకి, రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి 100 మీటర్ల వరకు ఆంక్షలను ఆర్‌ఓ సాయిబాబా అమలు చేస్తున్నారు.

షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన సందర్భంలో మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థితో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్‌లు, శ్రీధర్‌రెడ్డి, వెంగళరావు నగర్ కార్పోరేటర్ దేదీప్య ఉన్నారు. నామినేషన్ రెండో సెట్ దాఖలు చేయు సందర్భంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్‌రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పోరేటర్ రాజ్‌పటేల్‌లు పాల్గొన్నారు.

10 మంది 13 నామినేషన్లు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు మూడో రోజు 10 మంది 13 సెట్లుగా తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజుల్లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 30 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బిసి బంద్‌కు బిజెపి మద్దతు: రాంచందర్ రావు

బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్‌కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్‌తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు.

బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్‌కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్‌లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు.

ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్‌లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు.

కెస్లర్ సిండ్రోమ్ అంటే ?

కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.

టపాకులు కాల్చండి.. పర్యావరణాన్ని కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్‌క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్‌క్రాకరీస్‌ను కాల్చాల్సి ఉంటుంది.

అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం.

ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం: మంత్రి పొన్నం ప్రభాకర్

 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు.

ఓట్‌చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.