elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExness

ట్రెండ్ సెట్ చెయ్…

నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ జటాధర నుంచి ప్రమోషనల్ సాంగ్ ట్రెండ్ సెట్ చెయ్ రిలీజ్ అయింది. ఇన్‌స్టంట్‌గా ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంటర్‌టైనింగ్ బీట్స్, కలర్‌ఫుల్ విజువల్స్, సుధీర్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అందరినీ అలరిస్తోంది. రీస్, జైన్ – సామ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్‌ఫుల్ ఎనర్జీతో అదిరిపోయింది. లిరిసిస్ట్ శ్రీమణి తెలుగుతో ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ, ఆకట్టుకునే వర్డ్ ప్లేతో సాంగ్‌ను ట్రెండీగా రాశారు. జితేందర్ ,రాజీవ్ రాజ్ తమ గాత్రంతో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చారు.

స్టైలిష్ పబ్ సెట్‌లో తెరకెక్కిన వీడియోలో సుధీర్ బాబు, శ్రేయా శర్మతో కలసి స్టైలిష్ మూవ్స్ చూపిస్తూ అదరగొట్టారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ మిథాలజికల్ స్పెక్టాకిల్‌లో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఆ విషయం దాచి పెళ్లి చేసినందుకు… వైద్యురాలిని చంపిన వైద్యుడు

బెంగళూరు: భార్యకు అనారోగ్య సమస్యలు దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు తన భార్యను మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేందర్ రెడ్డి అనే వ్యక్తి జనరల్ సర్జన్ డాక్టరుగా పని చేస్తున్నాడు. కృతికా రెడ్డి అనే యువతి డెర్మటాలజిస్టుగా విక్టోరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోంది. మహేందర్ రెడ్డికి కృతికా ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లి కూతురుకు గ్యాస్ట్రిక్, లోషుగర్, అజీర్ణం సమస్యలు దాచి పెళ్లి చేయడంతో మహేందర్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. భార్యను ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. చికిత్స పేరుతో ఆమెకు అనస్తీషియా డోసులు పెంచుతూ వచ్చాడు. ఇంట్లో హఠాత్తుగా పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని శవ పరీక్ష నిర్వహించారు. అధిక మోతాదులో అనస్తీషియా డోసులు ఇవ్వడంతోనే మృతి చెందిందని శవ పరీక్షలో తేలింది. వెంటనే వైద్యుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

శ్రీ కపిలేశ్వరాలయంలో 22 నుంచి కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

తిరుపతి: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 22 నుంచి న‌వంబరు 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేష పూజ హోమమహోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 22వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.  అక్టోబ‌రు 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబ‌రు 24 నుండి 26వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబ‌రు 27న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబ‌రు 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.

అదేవిధంగా అక్టోబరు 29న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, అక్టోబరు 30 నుంచి న‌వంబ‌రు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), న‌వంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం (రుద్రహోమం), న‌వంబ‌రు 19న ధ‌ర్మ‌శాస్త్ర హోమం, న‌వంబ‌రు 20న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా అక్టోబరు 27న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.

హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ :

శ్రీ కపిలేశ్వరాలయంలో టిటిడి నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టిటిడి ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టిటిడి నిర్వహిస్తోంది.

YouTube down : యూట్యూబ్​ డౌన్​- సోషల్​ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్​..

Is YouTube down : ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా అమెరికాలో యూట్యూబ్ సేవలు చాలా సమయం పాటు నిలిచిపోయాయి. యూట్యూబ్​​ పనిచేయడం లేదని లక్షలాది మంది యూజర్లు ఇతర సోషల్​ మీడియా వేదికల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.

దీపావళికి ముందే కాలుష్య మేఘాలు

దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో కోరలుచాచే వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర అస్వస్థులుగా చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్, హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఈ ఏడాది దీపావళి ఇంకా రాకముందే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకోవడం గమనార్హం. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చి నివేదిక ప్రకారం గాలి నాణ్యత స్థాయి బాగా క్షీణించిందని వెల్లడైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. బుధవారం ఉదయానికే ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్లు దాటిందంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నోయిడాలో 369, ఘజియాబాద్‌లో 325, ఫరీదాబాద్‌లో 267 పాయింట్లలో వాయు నాణ్యత క్షీణత నమోదైంది. వాయు నాణ్యత సూచిక ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణత 300 పాయింట్లు దాటింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయానికి నోయిడాలో నాణ్యత సూచిక 369 కాగా, ఘజియాబాద్‌లో 320 325 మధ్య నమోదయ్యాయి. గాలిలో కాలుష్య రేణువులు ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కగట్టి పరిశీలిస్తేనే కాలుష్య స్థాయి తెలుస్తుంది. దీనిని పర్టిక్యులేట్ మాటర్ అంటే పిఎంగా పరిగణిస్తారు. గత ఏడాది దీపావళి రోజున దేశంలోని అనేక నగరాల్లో అత్యధిక స్థాయిలో కాలుష్య రేణువుల (పిఎం) స్థాయిలు నమోదయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, తదితర ఏడు నగరాల్లో గంటగంటకు కాలుష్య స్థాయిలు పెరిగిపోయాయి. ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో 500 మైక్రోగ్రాముల వంతున కాలుష్య స్థాయిలు దాటిపోయాయి. దీపావళి రోజున, టపాసులు, బాణాసంచాల కాల్పులే ఈ కాలుష్య స్థాయిలు పెరిగిపోవడానికి కారణమైందని పరిశోధకులు వెల్లడించారు. 2016లో పుణెకు చెందిన ది చెస్ట్ రీసెర్చి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీపావళి రోజున బాణాసంచా నుంచి వెలువడే పిఎం 2.5 కాలుష్య రేణువుల మొత్తాన్ని కొలవడానికి ప్రయోగాలు నిర్వహించింది.

పాము మాత్ర పటాకుల నుంచి అత్యధిక స్థాయిలో 2.5 మైక్రాన్ల వ్యాసంలో 64,500 పిఎం కాలుష్య రేణువులు విడుదల అవుతున్నాయని వెల్లడించింది. గత ఏడాది ఉత్తరాది నగరాల్లో దీపావళి రోజున కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. దీపావళి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం కనిపించింది. దీపావళి రోజున ఇతర రకాల కాలుష్య కారకాలు కూడా రికార్డు స్థాయిని అధిగమించాయి. కార్బన్ మోనాక్సైడ్, అట్మాస్ఫియరిక్ అమ్మోనియా, నైట్రస్ ఆక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు రికార్డు స్థాయిని దాటడం విశేషం. ఢిల్లీలో సాధారణంగా 80 వరకు కాలుష్య స్థాయిల పరిమితి ఉంటుంది. కానీ గత ఏడాది దీపావళి రోజున 140 వరకు కాలుష్య రేణువుల స్థాయిలు కనిపించాయి. సల్ఫర్‌డైయాక్సైడ్ స్థాయిల ప్రభావంతో గుండె జబ్బుల రోగులు ఆస్పత్రుల్లో అత్యధికంగా చేరవలసి వచ్చింది. వాయు కాలుష్యానికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధం ఉంది. గుండెపోటు, పక్షవాతం, ఇవి కాక మరికొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాలుష్య 20 నగరాల్లో 14 ఉత్తర భారతం లోనే ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాయు నాణ్యత క్షీణించడం కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. ఏటా ముఖ్యంగా శీతాకాలంలో ఇండో గంగాటిక్ మైదాన ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో చేరుకోవడం పరిపాటిగా వస్తోంది. ఢిల్లీలో కాలుష్యానికి గత ఏడాది ఆప్ ప్రభుత్వమే కారణమని బిజెపి ఆరోపించింది. ఈ ఏడాది బిజెపి ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నా కాలుష్యం మితిమీరడానికి ఎవరు బాధ్యులు అన్న వివాదం ఎదురవుతోంది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు అనేక ఆంక్షలు విధించినా, అనేక అభ్యర్థనలతో చివరకు గ్రీన్ కాకర్స్‌కు అనుమతించింది. ఐదేళ్లపాటు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ కాకర్స్ వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్‌ఐఆర్), నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్( ఎన్‌ఇఇఆర్‌ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజులో రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ బూడిద వాడకుండా, తయారు చేసే బాణాసంచాను గ్రీన్ కాకర్స్‌గా పిలుస్తారు. హానికరమైన రసాయనాలు ఇందులో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30శాతం తక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అనుమతి ఇచ్చింది. మరి దీని ప్రభావం దీపావళి రోజున ఎలా ఉంటుందో చూడవలసిందే. 

రాగాల వాగ్దేవి రావు బాలసరస్వతి

పట్టుకుచ్చుల లాంటి రెక్కలు విప్పి పైకెగరడమే పాట లక్షణం. భావమెంత బరువైనా వినేవారి గుండెల్లోకి సులువుగా దూసుకెళ్ళి కదిలించటం దాని స్వభావం. అది భావగీతమైనా, లలితగీతమైనా, జానపదమైనా, సినిమా పాటైనా, విన్న వెంటనే అందులోని భావం శ్రోతకి స్ఫురించి, పులకింపజేయడం పాట నైజం. చిన్నమాటలతో పెద్దభావాన్ని చెప్పడం పాట కుండాల్సిన ముఖ్యమైన నేర్పు. ఒకటీ రెండు కఠినమైన పదాలు కవి వాడాల్సి వచ్చినా, వాటికి బాణీ కూర్చేవారు సంగీతంలోకి వొది గేలా మలుస్తారు. అప్పుడది మెత్తగా శ్రోతకి చేరుతుంది. 1920ల తర్వాత భావకవిత్యోద్యమం వల్ల కవులందరూ అన్ని ప్రక్రియలకంటే పాట (గేయం) రచించడానికి ఉత్సా హంగా ముందుకురికారు. పద్యాలు, పద్యకావ్యాలు, నాట కాలు… ఏది వ్రాయాలని వ్రాస్తున్నా, తోచినప్పుడు ఒక పాట కూడా వ్రాస్తూ వచ్చారు. పాటంటూ వ్రాస్తే దానికి బాణీ కూర్చుకుని పాడే గాయకులు కావాలి. పాట పాడితేనే అందం… ఉత్తినే పాటలోని మాటలు చదివితే తృప్తిగా ఉండదు… అందమూ రాదు. ఒక పక్క రేడియో, మరొక పక్క గ్రామఫోను, ఇంకొక పక్క సినిమా తెలుగు పాటకి గొప్ప ఆలంబనాలయ్యాయి. ఆ సమయంలోనే గొప్ప ప్రతిభావంతులైన గాయనీగాయకులు పాటలు పాడేందుకు ముందుకొచ్చి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు.

గ్రామఫోను కంపెనీవారు అప్పటికే క్లాసికల్ సంగీతం రికార్డులుగా తీసుకొచ్చి, సంగీత ప్రియులకు వీనులవిందు చేస్తున్నారు. వారే లలిత(భావ)గీతాలను రికార్డులుగా తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పట్లోనే రావు బాలసరస్వతీదేవి పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 1928, ఆగస్ట్టు 28న పార్థసారథి, విశాలాక్షి దంపతులకు మద్రాసులో అపురూపంగా జన్మించింది అందాల బాలసరస్వతీదేవి. ఆ తర్వాతవారు గుంటూరులో ఉండేవారట. నాన్నగారు పార్థసారథికి ఒక సినిమా థియేటర్ ఉండేదట. తల్లి విశాలాక్షి గొప్ప సంగీతజ్ఞురాలు. ఆమెకి సంగీతమన్నా, పాటలన్నా పట్టరాని మక్కువ. అందుకే ఇంటి నిండా సంగీతమయంగా, ఎన్నో గ్రాముఫోను రికార్డులు, వాటిలోని సంగీతం ముఖరితమవుతుండగా పెరిగిన బాల సరస్వతి తనూ పాడటం మొదలు పెట్టారు. గ్రామ ఫోను రికార్డుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, స్థానం నరసింహారావు లాంటి గొప్పగొప్ప వాళ్ళు పాడిన పాటలామెకి అవలీలగా వచ్చేసేవి. ఆమె వాటిని గొంతెత్తి హాయిగా పాడేవారు. మూడునాలుగేళ్ళ వయసు చిన్నారిగా బాలసరస్వతి నాటకానికి వెళ్ళి మామూలుగా తల్లి ఒళ్లో కూర్చున్నారు.

రంగస్థలం మీద రామనాథశాస్త్రి పాట మొదలుపెట్టగానే హాలంతా పాటతో మారుమోగడం మొదలైంది. ఒళ్ళో కూర్చున్న బాలసరస్వతి తనూ వెళ్ళి పాట పాడుతానని మారంచేయడం మొదలుపెట్టింది. ఆమెను సముదాయిం చడం ఆ తల్లి వల్ల కాలేదు. ఇంతలో విషయం తెలుసుకున్న రామనాథశాస్త్రి స్వయంగా వేదిక దిగివచ్చి, బాలసరస్వతిని ఎత్తుకుని తీసుకువెళ్ళి ‘పాడమ్మా పాడు’ అన్నారు. ఆమె వెంటనే జంకూ గొంకూ లేకుండా ‘నమస్తే ప్రాణనాథా’ అంటూ, అంతక్రితమే ఆయన పాడిన పాటనే మొదలుపెట్టి అత్యంత అద్భుతంగా పాడేసరికి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులై విన్నారు. ఆయన ఆ చిన్నారిని ఆశీర్వదించి, ‘ఈ పసిపాప గొప్ప గాయని అవుతుంది’ అంటూ దీవించారు. 1935లో ఆమెకు బాలనటిగా ‘సతీ అనసూయ’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ధృవ విజయం’, ‘బాల యోగిని’, ‘భక్త తుకారాం’ మొదలైన చిత్రాలలో నటించారు. ‘భక్త కుచేల’లో కృష్ణుడిగా చేసి గొప్పపేరు పొందడమే కాకుండా, ఆమె పాడటంలోని ప్రత్యేకతను అందరూ గుర్తించేలా చేశారు. ఆ తర్వాత సాలూరి రాజేశ్వరరావుగారితో కలిసి ‘ఇల్లాలు’ చిత్రంలో నటించారు. ఏడేళ్ళ వయసుకే గ్రామఫోను రికార్డిచ్చిన బాలసరస్వతీ దేవి కేవలం పదిహేనేళ్ళ వయసులోపునే పదమూడు సినిమాల్లో నటించి పాడారు. అదీకాక లలిత సంగీతం తెలుగు నాట వెల్లివిరుస్తున్న తరుణంలో భావగీతాలు పాడటంలో ఒక ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో రాజేశ్వరరావుగారితో కలిసి ఆమె పాడిన ఈ పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉన్నాయి.

‘పాట పాడుమా కృష్ణా – పలుకు తేనెలొలుకునటుల’

‘కలగంటి కలగంటి – కమల రేకుల’ వంటి ఈ రెండు పాటలు శ్రీసాలూరి వారితో కలిసి పాడారు రేడియోలో. కానీ ఈ పాటలు హెచ్.ఎమ్.వి కంపెనీ రికార్డు తీసుకొచ్చినప్పుడు రాజేశ్వరరావుగారు ఒక్కరు మాత్రమే పాడారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే లలితగీతాలు పాడుతూనే ఆమె సినిమా పాటకీ ఒక ప్రత్యేకతని చేకూర్చారు. రావు బాలసరస్వతీదేవి మరొకరికి తన గళాన్నిచ్చిన మొట్టమొదటి తెలుగు నేపథ్యగాయని (ప్లేబాక్ సింగర్). 1943లో శ్రీరేణుకా ప్రొడక్షన్స్‌వారు ‘భాగ్యలక్ష్మి’ చిత్రం నిర్మించారు. అందులో హీరోయిన్ కమలా కొట్నీస్, ఆ సినిమాకి సంగీతం భీమవరపు నరసింహారావు (బిఎన్ ఆర్) ఆ సినిమా కోసం -‘తిన్నెమీద చిన్నోడ వన్నెకాడా/ తేనె తుట్టిలాంటి ఓ చిన్నవాడా’ అనే సముద్రాల రాఘవాచార్య రచన మొట్టమొదటి సారిగా నేపథ్య గీతంగా రికార్డు చేశారు. ఆ పాటను రావు బాలసరస్వతీదేవి పాడి, మొట్టమొదటి నేపధ్యగానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు సినిమాలకి పాడుతూనే ఉన్నారు. ఆమె పదహారో ఏట ఆమెని హార్స్ రేస్ గ్రౌండ్లో కోలంకి రాజావారు చూశారు. రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దర్’ అయిన ఆ కోలంక జమీందారు ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఆమెకి పదహారేళ్ళు, ఆయనకి నలభై ఏళ్ళు. అలాగని మొదటి వివాహమూ కాదు. విశాలాక్షిగారికి తన కూతురికి పెళ్ళికుదరడం ఎంతో ఆనందం కలిగించింది. పార్థసారధిగారికి కళలయందు ఎంత ఇష్టం ఉన్నా, ఆ గొప్ప సంబంధం, కోరుండి, ఎదురొచ్చేసరికి ఆయనా ఆనందపడ్డారు. బాలసరస్వతికి పెద్ద ఆలోచించుకునే శక్తీలేదు. అవకాశమూ లేదు. 1944లో (సుమారుగా) పెళ్ళయితే కొంతకాలం ఆమె సినిమాల్లో పాటలు పాడారు. కానీ ఎన్నో ఆంక్షల మధ్య, పరువు పరదాల చాటున మగ్గుతూనే మద్రాసు వచ్చి పాటలు పాడుతూండేవారుట. అంతవరకు స్వేచ్ఛగా రాత్రీ, పగలూ షూటింగ్లు, రికార్డింగులు చేసి, జనాల మధ్య గొప్ప ఆకర్షణతో, కీర్తి ప్రతిష్టలతో, ధనార్జనతో మసులుకున్న బాలసరస్వతీదేవి ఒక్కసారి బందిఖానాలో పడిపోయినట్లు, ఊపిరాడనట్లు బాధపడ్డారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’ సినిమా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో, సంగీతం కూడా అంత ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా బాలసరస్వతీ దేవి పాడిన మూడు పాటలూ ఆణిముత్యాలై నిలిచాయి. సి.ఆర్. సుబ్బరామనికి శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టిందీ ‘దేవదాసు’ సినిమా. సినీరంగంలోకి ప్రవేశించినప్పుడు లలితగీతాలు, కొన్ని సినిమా పాటలు సాలూరి రాజేశ్వరరావుగారితో పాడినా, ఆ తర్వాత కాలంలో ఆమె ఆయన సంగీత దర్శకత్వంలో పాటలు పాడినట్లు కనిపించదు.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు బి.ఎన్.ఆర్. (భీమవరపు నరసింహారావు), గాలిపెంచెల నరసింహారావు, అద్దేపల్లి రామారావు, సి.ఆర్. సుబ్బరామన్, పెండ్యాల నాగేశ్వర రావు, సాలూరి హనుమంతరావు, రమేష్ నాయుడు, టి.వి. రాజు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎమ్.ఎస్. విశ్వనాథన్, రజని… ఇలా ఇలా ఎందరెందరో ఆ గాత్రం మీద మోజుతో, ఇష్టంతో పాటలు పాడించారు. సుమారు ఇరవై సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత రావు బాలసరస్వతీదేవి బయట ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. రాజాగారి మరణం తర్వాత ఆమె మళ్ళీ సంగీతం వైపు దృష్టి పెట్టారు. ఏ భోగభాగ్యాలు, హోదాలు, ఆస్తిపాస్తులు ఆశించి ఆమె కఠోర నిర్ణయం తీసుకున్నారో అవి ఆమెకి పెద్దగా లభించనేలేదు. రాచరిక వ్యవస్థలోని మోసాలు, దగాలు ఆమె చవిచూసారు. ఇద్దరు పిల్లలతో ఆమె నిరాడంబరంగా బయటకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశంలోని సంగీతాభిమానులందరూ ఆమెని సాదరంగా ఆహ్వానించారు. కొంత వయసు మీద పడినా ఆమె చక్కగా పాడగలుగు తూండటం వల్ల సంగీత దర్శకులు రమేష్ నాయుడుగారు ఆమెని ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో పాడించి గౌరవించారు.

తరువాత ఆమె సి. నారాయణరెడ్డిగారు రచించిన మీరా భజన్లు, రమేష్ నాయుడు సంగీతంలో పాడి, క్యాసెట్ విడుదల చేశారు. ఆమె సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశించే నాటికి సినిమా పాట స్వరూప స్వభావాలు చాలా మారిపోయాయి. కాలానుగుణంగా ఆమె చేత పాడించేవీలు కూడా తగ్గిపోయింది. రావు బాలసరస్వతీదేవి ఆనాటి నుంచీ పరిశ్రమలోనే ఉండి ఉంటే మరికొన్ని మంచి పాటలు పాడగలిగే వారేమో గానీ, మధ్యలో ఖాళీ వల్ల, పూర్వస్థితిని చేరుకోవడం కష్టమే అయింది. ఆ సమయంలోనే ఆమె పాడిన పాటలన్నీ క్యాసెట్లుగా వచ్చాయి. ఆమె అభిమానులందరూ మళ్ళీ ఆమె గాత్రం విని ఆనందించారు. అయితే అప్పట్లో ఆర్థికంగా కూడా బాగా లేకపోవడం, పిల్లలు చిన్నవారు కావడం, రాజావారి ద్వారా ఆమె కొచ్చిన ఆస్తి చిక్కులు తీసుకురావడం ఆమెని బాధించాయి. అయినా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. ఆమె బొంబాయిలో వసంత్ దేశాయ్ దగ్గర కొన్నాళ్ళు శిక్షణ పొందారు. సున్నితంగా పాడే విధానం, మెత్తని కంఠ స్వరం, స్పష్టంగా పలికే కళలు, సాహిత్యాన్ని భావంతో పలికే తీరు అక్కడి సంగీత దర్శకుల్ని ఆకర్షించాయి. నౌషాద్ సంగీత దర్శకత్వంలో తయారవుతున్న ‘ఉడన్ ఖటోలా’ తమిళ వర్షన్‌లో పాటలు పాడేందుకు బాలసరస్వతి కంఠాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆమెని బొంబాయి పిలిపించుకుని రెండు పాటలు రికార్డు చేశారు. హిందీలో లతామంగేష్కర్ పాడిన పాటలు తమిళంలో ఈమె పాడటం కొంత సంచలనాన్ని సృష్టించింది -ఆమె పాడిన పాటలు అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాతేం జరిగిందోగానీ మిగిలిన పాటలు రికార్డు కాలేదు. ఆ తర్వాత ఆమె పాడలేదు.

 ఇంద్రగంటి జానకీబాల

(రచన మాసపత్రిక సౌజన్యంతో)

సిఎం టూర్‌కు మంత్రి సురేఖ డుమ్మా

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టూర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. బుధవారం హన్మకొం డ జిల్లాలో జరిగిన సిఎం టూర్‌లో జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మకు సిఎం హాజరయ్యారు. గం టన్నర పాటు ఉన్న సిఎం టూర్‌లో ఎక్క డా మంత్రి సురేఖ కనిపించలేదు. ఇప్పుడిదే జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్ గా మారింది. అయితే కాంగ్రెస్‌లో తొలినుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డి వర్గీయులకు రాజకీయంగా విబేధా లు ఉన్నాయి.

ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే సురేఖ గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ చనిపోయిన తర్వాత జిల్లా పర్యటనకు వ చ్చిన సురేఖ వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లలేదు. కనీసం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానైనా మంత్రి సురేఖ హాజరవుతారనిని భావించినా అలా జరగలే దు. సుదీర్ఘకాలంగా దొంతితో ఉన్న రా జకీయ విభేదాల వల్లనే రాలేదనే ప్రచా రం సాగుతోంది. మరోవైపు ఎంఎల్‌ఎ దొంతి తల్లి దశదినకర్మకు సంబంధించి మంత్రి సురేఖకు సమాచారం లేదని కొండా అనుచరులు చెబుతున్నారు. జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎఐసిసి పరిశీలకులతో కలిసి మీడియా స మావేశం నిర్వహించిన మంత్రి సురేఖ హైదరాబాద్ వెళ్లిపోయారు. బుధవారం సిఎం పర్యటన ఖరారు అయినప్పటికీ మంత్రి సురేఖ మాత్రం మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాగా, కొద్దిరోజులుగా జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు పొడసూపినట్లు మీడియాలో 

కథనాలు వెలువడ్డాయి. మేడారం జాతర సమీక్ష సమయంలో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి సురేఖ సైతం తాము జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. మేడారం జాతర సమీక్షను కూడా ప్రస్తావించారు. కేబినెట్ మంత్రిగా ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లకూడదో తనకు తెలుసునని ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో కొద్దికాలంగా హాట్‌టాపిక్‌గా మారిన్ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోమారు సిఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కనిపించకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవన్నీ కాంగ్రెస్‌లో కామన్ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

తీరని మానసిక ఆరోగ్య సంక్షోభం

కోచింగ్ సెంటర్ల హబ్‌గా పేరు పొందిన రాజస్థాన్‌లోని కోటలో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో యువదంపతులు తమ నాలుగునెలల పసివాడికి విషం ఇచ్చి తరువాత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారక సంఘటన. వారి సూసైడ్ నోట్‌లో తమ ఇల్లు, కారు అమ్మి అప్పులు తీర్చాలని రాశారు. ఈ వైపరీత్యాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఈ విషాదాంతాలు దేశంలోని సంక్షోభాన్ని తెరపైకి తీసుకొస్తాయి. ఈ భయంకరమైన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షోభం గ్రామాలు, నగరాలు, పాఠశాల తరగతులు, బోర్డు రూమ్స్, పొలాలు, ఇళ్ల వరకు వ్యాపించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ ఇన్ ఇండియా (ఎడిఎస్‌ఐ) 2023 నివేదిక ప్రకారం దేశంలో 1,71,418 ఆత్మహత్యలు సంభవించాయి.

అంతకు ముందటి సంవత్సరం కన్నా 0.38 శాతం ఎక్కువ పెరిగాయి. అండమాన్, నికోబార్‌దీవులు, సిక్కిం, కేరళలలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 40 శాతం కన్నా ఎక్కువగా ఆత్మహత్యల మరణాలు సంభవించాయి. గ్రామీణ భారతం కన్నా నగరాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇది నగరజీవితంలో ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది. ఆత్మహత్యలకు బలైన వారిలో 72.8% పురుషులు ఉండటం లింగ ఆధారిత ఆర్థిక, సామాజిక ఒత్తిడిని వెల్లడిస్తుంది. ఆత్మహత్యల్లో 31.9% కుటుంబ సమస్యలే కారణం అవుతుండగా, రోగాల బారినపడి అస్వస్థులు కావడం వల్ల 19%, మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసై 7% మంది, ప్రేమ సంబంధాలు, వివాహాల సమస్యలతో 10% మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2023 లో సంభవించిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 6.3% అంటే 10,786 మంది రైతుల ఆత్మహత్యలే. వీటిలో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి ఈ వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 1995 2015 మధ్య దాదాపు 2,96,000 కేసులు అప్పుల పాలవ్వడం, పంటలు దెబ్బతినడం, మార్కెట్ షాక్, వ్యవస్థాపరమైన నిర్లక్షం వల్లనే సంభవించాయి.

ఇళ్ల యజమానులు, సంరక్షకుల మరణాల సంగతి కూడా బయటపడకపోయినా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మనస్తాపానికి, వైవాహిక సమస్యలకు, గృహహింసకు గురవుతున్నారు. ఈ సమస్యలు అధికారిక గణాంకాల్లో ఇవి స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మనలో ఒకరికి ఒక సామాన్య ఉదయం అకస్మాత్తుగా మనుగడ బరువు భరించలేనంతగా అనిపించింది. అనారోగ్యం లేదా అలసట వల్ల కాదు. కానీ ప్రతి చిన్న పనికి తిమ్మిరి భావన అంటే అలసత్వం కనిపిస్తోంది. తమ పని పురోగతిలో ఉంది. కనిపించే సంక్షోభం లేదు. అయినప్పటికీ భరించలేనంత భారం అనిపిస్తోంది. అటువంటి నిశ్శబ్ద భయాందోళన క్షణంలో ఎవరితోనో మాట్లాడడం కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ను చేరువకావడం సురక్షితం అనిపిస్తోంది. మనుషులకు చేరువ అవడం కన్నా టెక్నాలజీ ఎందుకు అందుబాటులో ఉంది? అది ఒక బాధాకరమైన సత్యం లెక్కలేనంతమంది భారతీయులు ఆల్గోరిథమ్స్‌ను నమ్ముతున్నారు ఎందుకంటే వారికి వేరే ఎవరూ లేరు. ఇది సాంకేతిక వైఫల్యం కాదు, మానవ వైఫల్యం. దాదాపు 230 మిలియన్ మంది భారతీయులు మానసిక రుగ్మతలతో అల్లాడుతున్నారు.

మానసిక కుంగుబాటు, ఆందోళననుంచి మానసిక రుగ్మత, డ్రగ్స్‌కు బానిసవ్వడం వరకు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా సామాజిక కళంకం, తలకు మించిన ఖర్చు, వైద్య నిపుణుల తీవ్ర కొరత కారణంగా అధికారిక లేదా వృత్తిపరమైన సంరక్షణ ఉండడం లేదు. ఈ విధంగా వ్యక్తి తన జీవిత కాలంలో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి 10.6% వరకు ఉండగా, నిర్దిష్ట చికిత్సల మధ్య అంతరం అంటే చికిత్స సరిగ్గా అందని సమయాలు 70% నుంచి 92% వరకు ఉంటోంది. ఆత్మహత్యల అధికారిక గణాంకాలు స్థిరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా, ప్రతి లక్షమందిలో 16.3% ఆత్మహత్యల మరణాలు భారతదేశ అత్యధిక మానసిక ఆరోగ్య భారాన్ని తెలియజేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వెల్లడించింది. ఈ సంఖ్యల వెనుక యువ యూనివర్శిటీ విద్యార్థిని తాను జీవించడానికి అనర్హురాలునంటూ సూసైడ్ నోట్‌రాసి బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేయడం వంటి నిశ్శబ్ద నిరాశామయమైన గాథలున్నాయి. అనర్హురాలిని లేదా అనర్హుడను అన్న మాట హాస్టళ్లు, ఆఫీసుల్లో ఆత్మహత్యల నోట్‌ల్లో ప్రతిధ్వనించడం నిశ్శబ్ద నిరాశామయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.

భారత మానసిక ఆరోగ్య వ్యవస్థలో అప్రమత్తత అవసరం. ప్రతి లక్షమంది జనాభాకు ముగ్గురు సైకియాట్రిస్టులు తప్పనిసరి కాగా, కనీసం 1.7 మంది సైకియాట్రిస్టులైనా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, భారత్‌లో కేవలం 0.75 మంది మాత్రమే సైకియాట్రిస్టులు ఉండడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. అలాగే నర్సులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. కాలేజీలు, స్కూళ్లలో వేలాదిమంది విద్యార్థులకు ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి పార్ట్‌టైమ్ టీచర్ అరుదుగా ఉంటుంటారు. యూనివర్శిటీలు, కోచింగ్ హబ్‌ల్లో కౌన్సెలింగ్ ఇచ్చేవారు నామమాత్రం. వారిని నియమించడానికి సరిగ్గా నిధులు కూడా ఉండవు. కాగితం మీద మాత్రం, చట్టాలు చాలా ప్రగతిదాయకంగా ఉంటాయి. ఆత్మహత్యల నేరరహితానికి, మానసిక ఆరోగ్యం హామీ ఇవ్వడానికి 2017 లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులోకి తెచ్చినా ఆత్మహత్యల మరణాలను 10% వరకైనా తగ్గించాలని 2022 లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్షంగా పెట్టుకున్నప్పటికీ ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి.

పాఠశాలల ఆధారంగా సైకొలాజికల్ సపోర్టు స్కీమ్ ‘మనోదర్పణ్’ అమలులోకి తెచ్చినప్పటికీ చాలా అచేతనంగా మిగిలిపోయింది. ఇవికాక 47 పోస్ట్‌గ్రాడ్యుయేట్ సైకియాట్రీ విభాగాలు, 25 ఎక్స్‌సెలెన్స్ (శ్రేష్ఠత) సెంటర్లు మంజూరైనా, సిబ్బంది నియామకం, వేతనాల చెల్లింపు, శిక్షణ సమస్యల అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి ప్రత్యేకించి రూ. 270 కోట్ల బడ్జెట్ కేటాయించినా, అధిక శాతం ఏమాత్రం ఖర్చు కాకుండా ఉండిపోయింది. విధానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయాయి. ఈ రోజు కొన్ని కోట్లమంది భారతీయులు చాట్‌జిపిటి వంటి కృత్రిమమేధ (ఎఐ) సాధనాల వినియోగంలో నిమగ్నమవుతున్నారు. ఇది నమ్మకం వల్ల కాదు ఒంటరితనం వల్లనే. ఈ ఎఐ ప్లాట్‌ఫారమ్‌ను జోక్యం, గోప్యత హామీలు లేకపోయినా సంక్షోభమైనా, అనేక మంది యువ వినియోగదారులు చికిత్స అందించే వైద్యునిగా లేదా జీవిత తోడుగా పరిగణిస్తున్నారని ది ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఎఐ సహకరిస్తుంది. కానీ క్రమబద్ధీకరణ లేకుంటే ఈ రిస్కులు వాస్తవానికి, మానవ భద్రతకు ప్రమాదకరమైన ప్రత్యామ్నాయంగా పరిణమిస్తాయి.

భారతదేశం మానసిక ఆరోగ్యాన్ని తరువాతి ఆలోచనగా కాకుండా అత్యవసరమైనదిగా గుర్తించాలి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి అంతర మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమం రంగాలకు విస్తరించాలి. స్వయం ప్రతిపత్తిగల, స్వతంత్ర నిధుల కేటాయింపు వ్యవస్థగా స్పష్టమైన జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఐదేళ్లలో ప్రతి లక్షమందికి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు ఉండేలా నియామకం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నియామకమైన వైద్యనిపుణులకు శిక్షణ పొడిగించి, స్కాలర్‌షిప్‌లు, రాయితీలు కల్పించాలి. కౌన్సెలింగ్‌ను స్వచ్ఛంద సంస్థలా కాకుండా ప్రజామౌలిక సదుపాయంగా పరిగణించాలి. ప్రతిస్కూలు, కాలేజీ, జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ విభాగాల్లో పూర్తికాల శిక్షణ కౌన్సెలర్ ఉండాలి. ప్రతివారితో ప్రత్యక్ష అనుబంధం ఉండాలి. భారత్ తప్పనిసరిగా అత్యవసరంగా డిజిటల్ మెంటల్ హెల్త్ పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధం చేయాలి. భావోద్వేగ సహాయ యాప్స్, ఎఐ సాధనాలు గోప్యతా రిస్కులను బహిర్గతం చేయాలి. పటిష్టమైన, నైతిక, చట్టపరమైన, నిబంధనల చట్రం ఉంటేకానీ, ఆ సాధనాలు నాణ్యమైన మానవ భద్రతను కల్పించలేవు.  

బిసి రిజర్వేషన్లపై సుప్రీంలో నేడు విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బిసిలకు రిజర్యేవషన్ల శాతాన్ని పెంచడం పట్ల హై కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ కేసును వాదించనున్నారు. రిజర్వేషన్లపై 50శాతం దాటాకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభు త్వం రిజర్వేషన్ల శాతాన్ని పెంచిందని, అందుకు సం బంధించి జారీ చేసిన జీవో నెంబరు 9ని హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేర కు స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారమే తప్ప ఇందుకు తగిన మార్గదర్శకాలు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వా దించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకుమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వ ర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకో ర్టు చెప్పిందని కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. రా ష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ఈ అంశంపై సమ గ్ర, శాస్త్రీయ అధ్యయనం నిర్వహించిన విషయాన్ని స్పె షల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, వి ద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బిసిలు ఉన్నట్లు తేలిందని, 42శాతం రిజర్వేషన్ల కల్పనకు అదే ప్రాతిపదికని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342-ఎ(3) కిం ద దాఖలు పడిన అధికరణలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ఇలాంటి కసరత్తును రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసింది.

సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్ట్ ఐఎఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించిన విషయాన్ని కూడా తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది. బిసిలకు రిజర్వేషన్ల పెంపునకు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించిందని పేర్కొంది. ఆ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు తెలంగాణ బిసి రిజర్వేషన్ల బిల్లు -2025 ను శాసనసభ, మండలిలో ఏకగీవ్రంగా ఆమోదించిం దని పేర్కొంది. ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు సుప్రీం కోర్టుకు నివేదించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగపరమైన నిబంధన కాదని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ల శాతాన్ని పరిమితికి మించి పెంచుకునేందుకు ఇందిరా సాహ్ని తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని తన పిటిషన్‌లో పేర్కొంది.

జనహిత్ అభియాన్ కేసు తీర్పులోనూ ఈ విషయం ఉందని గుర్తు చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని జీవో 9 జారీ చేసినట్టు పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయని, ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు, మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంలో సంయమనం పాటించిందంది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వండని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ కేసు గురువారం విచారణకు జరగనుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపట్ల సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఇలా ఉండగా గురువారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరనగుంది.

ఆకలి విముక్త ప్రపంచం కోసం..

ఆహారం మనిషి జీవితానికి ప్రాణాధారం. ప్రాచీన కాలంలో ఆహారం అంటే జీవనవిధానం, ఆరోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలసిన సమగ్ర దృక్కోణం. కానీ నేడు ఆహారలేమి, పోషకాహార లోపం, శూన్యపుటాకలి, ఆకలివిపత్తు, ఆహారపు వృథా అనేవి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆహార సమస్యలు. ప్రపంచ వ్యాప్తంగా 78 కోట్లమంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 190 కోట్ల మందికి సురక్షితమైన పోషకాహారం అందుబాటులో లేదని, 14 కోట్ల మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలో కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా 10 కోట్ల మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందులో 70 వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది. అందరికీ ఆహారం లక్ష్యసాధన కోసం ఐక్యరాజ్యసమితి ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినం 1945 అక్టోబర్ 16వ తేదీని ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరపాలని యుఎన్‌ఒ సభ్యదేశాలు నిర్ణయించాయి. 1981లో మొదటిసారిగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం.

2024 లో మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికీ ఆహారపు హక్కు అనే నినాదంతో జరుపుకున్నాం. ఈ సంవత్సరం ‘మంచి ఆహారం మెరుగైన భవిష్యత్తు కోసం చేయిచేయి కలుపుదాం’ అనే ఇతివృత్తంతో వరల్డ్ ఫుడ్ ఫోరం- 2025 సమావేశాలు అక్టోబర్ 10- 17 తేదిలలో ఇటలీలోని రోమ్ నగరంలో జరుగుతున్నవి. ఇందులో బెటర్ ఫుడ్- బెటర్ ఫ్యూచర్ లక్ష్య సాధనకు బెటర్ ప్రొడక్షన్ బెటర్ న్యూట్రిషన్ బెటర్ ఎన్విరాన్‌మెంట్, బెటర్ లైఫ్ అను నాలుగు శాఖల ద్వారా ఆహార వ్యవస్థలను మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది. త్వరితగతిన మారుతున్న వాతావరణ సామాజిక ఆర్థిక అసమతుల్యతల వల్ల, భూతాపం, వరదలు, ఉక్రెయిన్ రష్యా వంటి యుద్ధాలు, ఎల్‌నినో- లానినా పరిస్థితులు జీవవైవిధ్యనష్టం, ఆహారపు గొలుసుల విచ్ఛిన్నం వంటి కారణాలతో సమీప కాలంలో అనూహ్య రీతిలో ఆహారసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన దేశంలో గత కొన్నేళ్లుగా రుతుపవనాలు సహకరించటం వల్ల ఆహారదినుసుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2021 -22 లో 316 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనాలను అధిగమించింది. అలాగే నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉద్యానవన ఉత్పత్తులు కూడా పెరిగాయి. పంటల ఉత్పత్తి పెంపుకు కేంద్రప్రభుత్వం మిల్లెట్స్‌మిషన్, పల్స్‌రెవల్యూషన్ పిఎం కిసాన్, పిఎం పోషణ్, పిఎం గరీబ్ అన్నయోజన వంటి పథకాలను బలోపేతం చేసి 2030 నాటికి ఆహారోత్పత్తి 20% పెంపు లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన, స్వావలంబన భారతదేశం దిశగా ముందుకు సాగుతోంది. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించటానికి జాతీయ ఆహార భద్రతా చట్టం -2013ను తెచ్చింది. ఆహార లభ్యత ఆహార అందుబాటు ఆహార వినియోగం, ఆహార స్థిరత్వం అను నాలుగు అంశాలు ఈ చట్టంలోని ముఖ్యఅంశాలు. దేశజనాభాలో మూడింట రెండువంతుల మందిని ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చింది. రాష్ట్రంలోనూ 2017లో తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర జనాభాలో 75% గ్రామీణ జనాభాను, 50% పట్టణ జనాభాను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చింది.

స్థూలంగా ఈ చర్యల వల్ల దేశంలో ఆహార భద్రత బాగా మెరుగుపడింది. భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని ప్రపంచ దేశాలు భారత్‌ను అనుసరిస్తే 2050 నాటికీ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని మన ఆహార వియోగం తీరు గురించి ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్‌కు చెందిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2024 అభిప్రాయపడటం గమనార్హం. వ్యవసాయంలో అధునాతన సాంకేతికతలను వినియోగించాలి. ఆహార నిల్వకు కోల్డ్ స్టోరేజ్, సరఫరా చక్రంను బలోపేతం చేయాలి. చెట్ల పెంపకం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఆహార వ్యర్థం ఆహార వృథాలను అరికట్టాలి. ధనవంతులు ఆహారాన్ని వృథా చేయకుండా పేదవారితో పంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవారి సంఖ్యను తగ్గించవచ్చును. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అంగీకరించడం, గౌరవించడం అత్యంత అవసరం.

భారత రవీందర్, 99125 36316