elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbetting

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

betcio

kralbet

meritking

betpas

Sweet Bonanza

Sweet Bonanza Oyna

tarafbet

betturkey

artemisbet

enbet

casinowon

casinoroyal

bahislion

asyabahis

Betcio

betebet

ఒఆర్ఎస్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు… వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం

పిల్లలకు కానీ పెద్దలకు కానీ నీళ్ల విరేచనాలు వస్తే ఒఆర్ఎస్ ద్రావకం వాడాలి అనేది గత 30 ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన ఒక వైద్య ప్రక్రియ. ఒఆర్ఎస్ ద్రావణంలో కొంత ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఉంటుంది. దీని వలన ఎక్కువ వాటర్ అబ్జర్బ్ కావడం వలన డిహైడ్రేషన్ భారి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ రిప్లేస్మెంట్స్ జరుగుతుంది. ఒకవేళ ఒఆర్ఎస్ ద్రావణం అందుబాటులో లేకుంటే నీళ్లలోకి కొంచెం ఉప్పు సోడాపొడి, నిమ్మకాయ రసం పిండుకొని తాగిన కానీ సరిపోతుంది. దానిలోకి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. కానీ చక్కెర మోతాదు ఎక్కువ అయితే ఆ మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి డిహైడ్రేషన్ పెరిగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

సరిగ్గా ఇదే విషయాన్ని ఓ పిల్లల వైద్య నిపుణురాలు గుర్తించింది. ఏమిటి అంటే కొందరు పిల్లలు ఒఆర్ఎస్ ద్రావకం తాగినా కానీ చనిపోతున్నారు. ఏమిటా ఒఆర్ఎస్ ద్రావకము అని చూస్తే అది అన్ని మెడికల్ షాపుల్లో అమ్ముతున్న ఒక బ్రాండెడ్ ద్రావకం. టెట్రా ప్యాక్ లో దానిని అమ్ముతూ ఉన్నారు. ఈ బ్రాండెడ్ ద్రావకం కూడా ఒఆర్ఎస్ అనే పేరుతో అమ్ముతూ దానిలో ఒక చిన్న లెటర్స్ లో దీనిని నీళ్ల విరేచనాలు వస్తే వాడరాదు అని రాశారు.. ఇందులో గ్లూకోజ్ కంటెంట్ చానా రెట్లు ఎక్కువ ఉండడమే కారణం.

శివరంజని అనే హైదరాబాద్ కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ ఇది కనుక్కొని దానిని పేరు మార్చుకోండి ఒఆర్ఎస్ అనేది డబ్ల్యు హెచ్ఒ రూల్ ప్రకారం దానిని దేనికంటే దానికి బ్రాండెడ్ గా ఉపయోగించరాదు. అని చెబితే ఎవరూ వినలేదు, దానికోసం ఆమె కోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించింది.. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎనిమిదేళ్ల న్యాయపోరాటం తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒఆర్ఎస్  అనేది ఎటువంటి రూపంలో కూడా పేరును దేనికి సాఫ్ట్ డ్రింక్స్ కు ఉపయోగించరాదు.అది ఒక మందు అది ఒక కూల్డ్రింక్ కాదు అని వివరించింది. 

పిల్లల ప్రాణాల కోసం బాధపడి సామాజిక బాధ్యతగా ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసిన ఆ శివరంజని చిన్నపిల్లల డాక్టర్ ను మనం అభినందిద్దాం.

ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండబట్టే మనకు కొంచెం న్యాయం జరుగుతోంది లేకుంటే అందరూ నాకెందుకులే అని అనుకుంటే ఎంతోమంది సైలెంట్ గా చనిపోతూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీల ధన దాహానికి బలి అయిపోతూనే ఉంటారు. నిజం అనేది నిష్టూరంగా ఉన్నా కానీ మొదట మన వాళ్లను ఎవరూ పట్టించుకోకపోయినా నిదానంగా అది బయటికి వస్తుంది అనేదానికి ఇదే ఉదాహరణ మీరేమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లమృతి

కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి చెందారు. పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌ వైమానిక దాడి జరిపింది. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్ల సహా 8 మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.  గత వారం రోజుల నుంచి పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుకోవడంతో వందల మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో సైనికులు కూడా ఉన్నారు. 

కొనసాగుతున్న బిసి సంఘాల బంద్

హైదరాబాద్: తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ టిసి డిపోల ముందు బిసి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్ టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బిసి సంఘాలు, రాజకీయ పార్టీల పిలుపు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం స్వచ్ఛందగా బంద్‌కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జెఎసి బంద్ లో పాల్గొన్నాయి. 

మావోయిస్టులకు భారీ దెబ్బ

ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూరులో శుక్రవారం అత్యధిక సంఖ్యలో అజ్ఞాత నక్సలైట్లు లొంగిపొయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట ఆయుధాలతో పాటు ఆత్మసమర్పణం చేసుకున్న వారిలో పలువురు కీలక సీనియర్ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో పార్టీ సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ అలియాస్ సతీష్ కూడా ఉన్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా రివార్డు ప్రకటితం అయి ఉన్న ఆశన్నతో పాటు మొత్తం 210 మంది వివిధ కేడర్స్‌కు చెందిన నక్సల్స్ ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి తాము వస్తున్నట్లు ప్రకటించడం సంచలనాత్మకం , ఇదే దశలో మావోయిస్టుల ప్రాబల్య ఉద్యమం బీటలు స, తీవ్రస్థాయి బలహీనతకు అద్దం పటింది. అడవుల నుంచి వీరి తిరోగమనం సంకేతం అయింది. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. 98 మంది పురుషులు వరుసగా వారి వారి పేర్లను అధికారులు పిలుస్తూ ఉండగా వచ్చి ఆయుధాలు వదిలి సరెండర్ అయ్యారు. మొత్తం 153 ఆయుధాలు వదిలిపెట్టారు.

వీటిలో 19 ఏకె 47 రైఫిల్స్, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 23 ఇన్సాస్‌లు, 303 రైఫిల్స్ 17 ఎన్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 41 బోర్ షాట్‌గన్‌లు, పిస్టల్స్, నాలుగు కార్బైన్‌లు ఉన్నాయి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నక్సల్స్ చరిత్రలో ఇది సామూహిక సరెండర్ ఘట్టం అయిందని అధికారులు తెలిపారు. కాగా ఈ శుక్రవారం ఓ చారిత్రక దినం అని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ స్పందించారు. ఇప్పటి సరెండర్లతో రాష్ట్రంలో గత మూడురోజులలో లొంగిపోయిన నక్సలైట్ల సంఖ్య 238కి చేరుకుంది. బుధవారం వేర్వేరు చోట్ల 28 మంది వరకూ లొంగిపోయారు. ఇప్పటి లొంగుబాట బస్తర్ ప్రాంతానికే కాకుండా యావత్తూ ఛత్తీస్‌గఢ్‌కు తద్వారా మొత్తం దేశానికి ఒక కీలక మైలురాయి అవుతుందని తెలిపారు. బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రపట్టణం జగదల్పూరులో నక్సల్స్ తమ ఆయుధాలను పోలీసులు, పారామిలిటరీ దళాల అధికారులకు అప్పగించారు. సరెండర్ ప్రక్రియ వేదిక వెనుక బ్యానర్‌లో అడవిబాట నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం అని స్థానిక గిరిజన భాషలో రాసి ఉంచారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం పూర్తి స్థాయి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో సాగిస్తున్న పోరులో ఈ సరెండర్ ముఖ్య అధ్యాయం అయింది. లొంగిపోయిన నక్సల్స్ బృందంతో స్థానిక గిరిజనుల తెగల నేతలు, కొండదేవతల పూజారులు కూడా నిలబడి ఫోటోలు దిగారు. వారికి గులాబీలు అందించారు. నూతన ఆరంభానికి, శాంతియుత జీవిత ఆకాంక్షలతో స్వాగతం పలికారు. ఆ తరువాత సీనియర్ పోలీసు అధికారులు , పారామిలిటరీ అధికారులతో కలిసి గిరిజన తెగలతో కలిసి మరో ఫోటో దిగారు.

నక్సలైట్ల లొంగుబాటు కోసం బస్తర్ పోలీసు అధికార యంత్రాంగం చాలారోజుల క్రితమే పునరావాస కార్యక్రమం పునామార్గెంను చేపట్టింది. ఈ పథకం పరిధిలో లొంగిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలకు హామీ ఇచ్చారు. లొంగుబాట్ల తరువాత సిఎం విష్ణుదేవ్ ఇక్కడనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లొంగిపోయిన కేడర్‌కు సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానం అని ప్రకటించారు. ఇంతకాలం తప్పుడు బాట పట్టిన వీరు సమాజానికి దూరం అయ్యారని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషకరం అని తెలిపారు.రాజ్యాంగం పట్ల విధేయతను, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునారావాస, లొంగుబాట్ల పథకంలో లోంగిన వారికి పలు విధాలుగా మేలు జరుగుతుంది. వారికి ఆర్థిక సాయం ఉంటుంది. భూమి కల్పిస్తారు. నూతన పారిశ్రామిక విధానం పరిధిలో చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఉపాది కల్పన ఏర్పాట్లు కూడా జరుగుతాయని, సరెండర్ అయిన వారికి తమ నుంచి పూర్తి స్థాయి ఆసరా ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మరింతగా నక్సల్స్ దళాలు సరెండర్ అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

లొంగిపోయిన సీనియర్ నేతల పేర్లు

ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్‌లో అగ్రస్థాయి నక్సల్స్‌లో ఆశన్నతో పాటు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (డికెఎస్‌జడ్‌సి) సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్‌మన్ మండవి, రణిత , రాజు సలాం, ధనూ వెట్టి అలియాస్ సంతూ ఉన్నారు. ఇక ఈ సీనియర్ల జాబితాలోనే ప్రాంతీయ కమిటీ సభ్యులు రతన్ ఎలామ్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్ బృందం తమకు తాముగా 11 బారెల్ గ్రెనెడ్ లాంఛర్లను కూడా అప్పగించారు. దేశంలో నక్సలిజం సమస్యను పూర్తి స్థాయిలో 2026 మార్చి 31 నాటికి నిర్మూలించి తీరుతామని హోం మంత్రి అమిత్ షా ఇటీవలి కాలంలో పదేపదే చెపుతూ వస్తున్నారు.ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఇటీవలే పెద్ద ఎత్తున నక్సల్స్ అగ్రనాయకులు కేడర్‌తో పాటు సరెండర్ అవుతున్నారు.

రెండు రోజుల క్రితం అత్యంత కీలక నక్సల్స్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ భూపతి 60 మందికి పైగా నక్సల్స్‌తో కలిసి మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్ ఎదుట గడ్చిరోలిలో లొంగుబాట పట్టారు. ఇప్పుడు రెండు మూడు రోజుల తీవ్ర ఉత్కంఠత నడుమ ఇప్పుడు ఆశన్న ఇతర కీలక కేడర్‌తో కలిసి సరెండర్‌కు దిగారు. బస్తర్ దాదాపుగా నక్సల్స్ విముక్తం అయిందని, ఇక మిగిలిన నక్సల్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవల్సి ఉంటుంది. లేదా వారు ఇప్పటికీ గన్‌తోనే తిరుగుతూ ఉంటే తమ భద్రతా బలగాల తూటాలకు బలి కావడం తథ్యమని అమిత్ షా చెపుతూ తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగుతూ వస్తున్న దశలోనే ఇప్పుడు ముందుగా మహారాష్ట్ర సిఎం ఎదుట అగ్రస్థాయి నేత, ఛత్తీస్‌గఢ్ సిఎం ముందు మరో టాప్ లీడర్ సరెండర్ కావడం కేంద్ర హోం శాఖ కీలక వ్యూహాత్మక కార్యాచరణ, ప్రత్యేకించి మావోయిస్టుల్లో తీవ్రస్థాయి భయాందోళనల దిశలో ముందుకు సాగే ప్రక్రియ అని వెల్లడైంది.

లొంగుబాట ఆశన్నది తెలంగాణలోని ములుగు ప్రాంతం

వరంగల్ ఫాతిమా కాలేజీ, ఆర్‌ఎస్‌యూ పూర్వరంగం

నక్సల్స్ బలగం తరఫున పలు భీకర దాడులకు వ్యూహరచన సాగించిన ఇప్పుడు లొంగిపోయిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. దాదాపు 60 సంవత్సరాల వయస్సున్న ఆశన్న 40 ఏండ్ల క్రితం అంటే తన 20 ఏండ్ల వయస్సులోనే పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులు అయి అడవిబాట పట్టారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అనబడే ఈ ఆశన్న విద్యాభ్యాసం ఎక్కువగా లక్ష్మిదేవిపేట ప్రభుత్వ స్కూల్‌లో సాగింది. తరువాత హన్మకొండ కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో ఆ తరువాత వరంగల్‌లో కాకతీయ వర్శిటీలో చదివారు. ఎక్కువగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు నాయకత్వం వహించారు. తరువాతి క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్ కాలేజీల్లోనే ఆయనపై ఎక్కువగా విప్లవోద్యమ ప్రభావం పడింది, ఓ దశలో దండకారణ్య జోనల్ కార్యదర్శిగా రూపేశ్ పేరిట వ్యవహరించినప్పుడు ఆయన నిర్వహించిన దాడులు సంచలనాత్మకం అయ్యాయి.

999లో ఐపిఎస్ ఉమేశ్ చంద్ర , మరుసటి సంవత్సరం హోం మంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల ప్రధాన వ్యూహకర్తగా , ప్రత్యేకించి జిలెటిన్ల ద్వారా పేలుళ్లకు దిగడంతో మెరుపుదాడుల కర్తగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అంతకు ముందు నేదురుమల్లి జనార్దన రెడ్డిలపై భారీ స్థాయి పోలీసు బందోబస్తు , అత్యంత నిశిత నిఘా నడుమ కూడా బాంబులు పేల్చి హత్యాయత్నం జరిగిన ఘటనల్లో కూడా ఆశన్నదే కీలక పాత్ర అని నిర్థారణ అయింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆశన్న కోసం భద్రతాబలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇటివలికాలంలో మావోయిస్టుల్లో తనకు పైన ఉండే అగ్రస్థాయి నాయకుల వైఖరితో విసిగి వేసారి ఆయన సరెండర్‌కు నిర్ణయించుకున్నట్లు, ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో అణచివేతలు, పైగా తనకు కొన్ని వర్గాల నుంచి అందిన లొంగుబాటు దౌత్యం దశలోనే ఆయన ఇప్పుడు అదునుచూసుకుని ఇతరులతో పాటు లొంగుబాటుకు దిగినట్లు వెల్లడైంది. 

స్థానిక ఎన్నికలు ఎప్పుడు?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చో టుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మ రో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేంద ర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సిజె జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. దీంతో బిసి రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహణపై స మాధానం చెప్పేందుకు ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 2 వా రాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు 

వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. దీంతో సుప్రీం కోర్టు మౌకికంగా చెప్పిందని, ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ఇసి తరపు న్యాయవాది కొర్టుకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించి, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓ ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఈ జీఓని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

బోగస్.. ఔట్‌సోర్స్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని ప లు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్న ట్లు అధికారుల విచారణలో బయటపడింది. బో గస్ ఉద్యోగుల పేరుతో నెలనెల జీతాలు తీసుకుంటూ వేల కోట్లు ప్రభు త్వ ఖజానాకు గండి కొట్టినట్లుగా తేలింది. వారి వల్ల ఏటా రూ.1,500 కోట్ల జీతాలు దుబారా అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. గడిచిన పదేండ్లలో ఈ బోగస్ ఉద్యోగుల పేరిట రూ.15 వేల కోట్లు ప్రభుత్వ ఖ జానాకు గండిపడినట్టుగా అధికారిక వర్గా లు పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వంలో ఔ ట్ సోర్సింగ్ ఏజెన్సీలను, కాంట్రాక్టు మ్యాన్ పవ ర్ కంపెనీలను ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు బోగస్ ఉద్యోగుల పేరుతో దోచుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో బోగస్ ఉద్యోగుల జీతాలను ఈ నెల (అక్టోబర్) నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం.

మా జీ సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిస భ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న ట్లు తేల్చిన కమి టీ అందులో కేవలం రెం డు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. సెప్టెంబర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాం క్ ఖాతాలు, తమ ఆధార్ వివరాలను ఇచ్చారు. మిగిలిన వారు ఈనెల 25వ తేదీ వరకు ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు వారి వివరాలు అందకపోవడం విశేషం. అయితే, ఈ కుంభకోణం పదేళ్ల బిఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే చోటుచేసుకుందని, అప్పటినుంచి ఇది కొనసాగుతుందని ప్రభు త్వం గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందా యి. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డికి శాఖల వారీగా వివరాలు కావాలని అన్ని శాఖల అధికారులను 

ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. దీంతోపాటు ఒక కమిటీని ప్రభుత్వం నియమించి పూర్తిస్థాయిలో దీనిపై నివేదిక తెప్పించుకుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమల్లోకి తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి మరింత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.

జిహెచ్‌ఎంసిలోనే 6వేల మంది బోగస్

బోగస్ ఉద్యోగుల జీతాల విషయంలో ఈనెల 25వ తేదీ తరువాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, ఈ కుంభకోణంలో పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కమిటీ ఇచ్చిన రికార్డుల ప్రకారం ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో (జిహెచ్‌ఎంసి) 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అసలు పని చేస్తున్న ఉద్యోగులు 15 వేలు మాత్రమేనని, మిగతా 6 వేలు బోగస్ అని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పలు శాఖల్లో కాగితాలపై చూపిన లెక్కలకు పనిచేస్తున్న వారికి పొంతన లేదని ప్రభుత్వం గుర్తించింది.

వివరాలు ఇవ్వని 2,18,976 మంది

రాష్ట్ర ప్రభుత్వం 31 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఇప్పటికే డేటాబేస్‌లో పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యా ప్తంగా 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా అందులో 2,22,376 మంది ఉద్యోగులు మాత్రమే తమ డేటాబేస్‌ను ప్రభుత్వానికి అందించారు. వీరితో పాటు 4,93,820 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 2,74,844 మంది ఉద్యోగులు మాత్రమే తమ వివరాలను ప్రభుత్వానికి అందించారని మిగతా 2,25,462 మంది వివరాలు ఇవ్వలేదని ప్రభుత్వానికి అందించిన నివేదికలో కమిటీ పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే, ఈనెల 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు, టెంపరెరీ ఉద్యోగుల వివరాలు ప్రస్తుతం ప్రభుత్వానికి అందాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శాఖల వారీగా వివరాలు ఇలా….

అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,477 మంది ఉండగా ఇప్పటివరకు 7,464 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,545 టెంపరరీ ఉద్యోగులకు గాను 4,574 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ కావడం విశేషం. ఇక, పశుసంవర్ధకశాఖ, డైరీ డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 5,218 మంది ఉండగా ఇప్పటివరకు 216 మంది డేటా అప్‌లోడ్ కాగా, 3,803 టెంపరరీ ఉద్యోగులకు గాను 2,872 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. బిసి వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 7,093 మంది ఉండగా ఇప్పటివరకు 1,039 మంది డేటా అప్‌లోడ్ కాగా, 4,983 టెంపరరీ ఉద్యోగులకు గాను 5,135 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. సివిల్ సప్లయ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 1,099 మంది ఉండగా ఇప్పటివరకు 558 మంది డేటా అప్‌లోడ్ కాగా, 857 టెంపరరీ ఉద్యోగులకు గాను 60 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. విద్యుత్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 73,171 మంది ఉండగా

ఇప్పటివరకు 44 మంది డేటా అప్‌లోడ్ కాగా, 22,223 టెంపరరీ ఉద్యోగులకు గాను 9 మంది ఉద్యోగుల డేటా అందింది. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీలో రెగ్యులర్ ఉద్యోగులు 4,629 మంది ఉండగా ఇప్పటివరకు 2,755 మంది డేటా అప్‌లోడ్ కాగా, 860 టెంపరరీ ఉద్యోగులకు గాను 32 మంది ఉద్యోగుల డేటా అందింది. ఆర్థికశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 2,672 మంది ఉండగా ఇప్పటివరకు 2,933 మంది డేటా అప్‌లోడ్ కాగా, 540 టెంపరరీ ఉద్యోగులకు గాను 326 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. జిఏడిలో రెగ్యులర్ ఉద్యోగులు 1,862 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1600 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 764 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 35,903 మంది ఉండగా ఇప్పటివరకు 14,876 మంది డేటా అప్‌లోడ్ కాగా, 60,934 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 62,801 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ చేశారు.

ఉన్నత విద్యా శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 16,177 మంది ఉండగా ఇప్పటివరకు 11,213 మంది డేటా అప్‌లోడ్ కాగా, 13,894 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,365 మంది ఉద్యోగుల డేటాను అధికారులు అప్‌లోడ్ చేశారు. హోంశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 82,424 మంది ఉండగా ఇప్పటివరకు 29,789 మంది డేటా అప్‌లోడ్ కాగా, 21,765 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 19,594 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. హౌజింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 444 మంది ఉండగా, 289 మంది టెంపరరీ ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పరిశ్రమల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 965 మంది ఉండగా ఇప్పటివరకు 472 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,264 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 77 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 64 మంది ఉండగా ఇప్పటివరకు 11 మంది డేటా అప్‌లోడ్ కాగా, 668 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 23 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.

ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 12,494 మంది ఉండగా ఇప్పటివరకు 9,381 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,524 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 742 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. కార్మిక, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 3,062 మంది ఉండగా ఇప్పటివరకు 1,840 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,312 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,056 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. లా డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 9,373 మంది ఉండగా ఇప్పటివరకు 2,474 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,304 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 505 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. లేజిస్లేటర్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 249 మంది ఉండగా 166 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 126 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.

ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది…

వీటితో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 4,439 మంది ఉండగా ఇప్పటివరకు 144 మంది డేటా అప్‌లోడ్ కాగా, 20,903 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 16,903 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పురపాలక శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 17,436 మంది ఉండగా ఇప్పటివరకు 3,267 మంది డేటా అప్‌లోడ్ కాగా, 62,913 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 35,203 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 27,266 మంది ఉండగా ఇప్పటివరకు 18,014 మంది డేటా అప్‌లోడ్ కాగా, 94,179 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 26,337 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 944 మంది ఉండగా ఇప్పటివరకు 667 మంది డేటా అప్‌లోడ్ కాగా, 184 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను72 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 04 మంది ఉన్నారు.

04 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 04 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 01 ఒక్కరూ ఉండగా ఇప్పటివరకు 01 ఒక్కరి డేటా అప్‌లోడ్ కాగా, 02 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 02 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 25,006 మంది ఉండగా ఇప్పటివరకు 10,090 మంది డేటా అప్‌లోడ్ కాగా, 12,843 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 8,764 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,339 మంది ఉండగా ఇప్పటివరకు 1,326 మంది డేటా అప్‌లోడ్ కాగా, 5,928 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 897 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది ఉండగా ఇప్పటివరకు 93,992 మంది డేటా అప్‌లోడ్ కాగా, 78,146 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 20,258 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, భవనాల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 43,757 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్‌లోడ్ కాగా, 7,822 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 601 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ట్రైబల్ వెల్ఫేర్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,375 మంది ఉండగా

ఇప్పటివరకు 2,396 మంది డేటా అప్‌లోడ్ కాగా, 6,555 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,045 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ఉమెన్, చిల్డ్రన్స్, డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 2,801 మంది ఉండగా ఇప్పటివరకు 2,045 మంది డేటా అప్‌లోడ్ కాగా, 60,492 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 59,375 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 781 మంది ఉండగా ఇప్పటివరకు 679 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,336 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,322 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.

నేడు బిసిల రాష్ట్ర బంద్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 18 శనివారం చేపట్టిన తెలంగాణ బంద్‌కు భారీ ఎత్తు న మద్దతు పెరిగింది. అన్ని రాజకీయపార్టీలు, బిసి సంఘాలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో మద్ద తు ప్రకటించాయి. బిసిలంతా ఏకమై తొలిసారి చే పడుతున్న రాష్ట్ర బంద్‌కు కనీవినీ ఎరుగని మద్దతు వస్తోంది. ‘బంద్ ఫర్ జస్టిస్’ నినాదంతో గతంలో జరిగిన సకల జనుల సమ్మెను గుర్తుకుతెచ్చేలా ఒకే మాటపై నిలబడి బంద్‌లో పాల్గొనేందుకు తె లంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెం చిన రిజర్వేషన్లను రక్షించుకోవడానికి శనివారం చేపట్టే బంద్‌కు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజె పి, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం టీజేఎస్, సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సంఘాలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

బిసి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం బంద్‌కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పల్లె నుండి పట్నం వరకు సంపూర్ణంగా బంద్ జరుగుతున్నందున రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని బంద్ నిర్వాహక సంస్థలన్నీ ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

మద్దతు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

అధికార కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. బంద్ లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునే బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మధుయాష్కి గౌడ్ తెలిపారు. కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం తదితర పరిణామాలతో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఇక క్షేత్రస్థాయి నుంచి, ప్రజల మమేకంతో పోరాటానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదనే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ సంఘాల పిలుపుతో శనివారం చేపట్టే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం వివిధ విభాగాలలోని బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిని, ఇతర జేఏసీ నాయకులను కలిసి బంద్ మద్దతు కోరారు. ఈ మేరకు బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం నాడు నారాయణగూడ వైఎంసిఏ చౌరస్తా నుండి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వరకు ఉదయం 11 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.

బంద్ విజయం కోరుతూ బిసి సంఘాల ర్యాలీ

బంద్‌కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారు. అలాగే 42 శాతం రిజర్వేషన్ న్యాయబద్ధమైనది పేర్కొంటూ రాష్ట్ర బంద్ కు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక పూర్తి మద్దతు తెలిపింది.

నేడు సకలం బంద్: జాజుల శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర బంద్‌తో రాష్ట్రంలో సకలం బంద్ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి తొలిసారిగా బీసీ బంద్‌కు మద్దతుగా ఇటు లెఫ్టిస్టులు ఆటో రైటిస్టులు, ఇంకొక వైపు లౌకిక శక్తులు సామాజిక శక్తులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కల్వకుంట్ల కవితను కోరిన కృష్ణయ్య

తెలంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్. కృష్ణయ్య ’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరారు. ఈ మేరకు ఆమె నివాసానికి వెళ్లిన కృష్ణయ్యతో కవిత మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిం కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందని తెలిపారు. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందుండి పోరాడుతున్న తెలంగాణ జాగృతి బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తోందని ప్రకటించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహిస్తారని, ఈ మానవహారంలో కవిత పాల్గొంటారని జాగృతి వర్గాలు తెలిపాయి.

అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: డిజిపి శివధర్‌రెడ్డి

రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీలు, ప్రజా సంఘా లు, బిసి సంఘాలు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు బంద్ పరిస్థితులను పర్యవేక్షిస్తాయని డిజిపి శుక్రవారం స్పష్టం చేశారు. బం ద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిజిపి కోరారు.

గ్రీన్‌కార్డు ఇక కలేనా?

వాషింగ్టన్: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకా శం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమంలో గత ఐ దేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్టు తెలిపా యి. ఏటా 50వేల మంది లోపు అమెరికాకు వల స వచ్చే దేశాలకే అవకాశం ఇస్తున్నట్టు సమాచా రం. అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్షంతో ఇ లాంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీసా లాటరీలో పాల్గొనడానికి అనుమతి ఉన్న దేశాలకు తాజా వీసా కేటాయింపులను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమి తి మించిపోయిందని,

అందువల్లే ఈ లాటరీలో పా ల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని సం బంధిత అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో , 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస రాగా, 2022 లో ఈ సంఖ్య 1,27,010 గా ఉంది. ఇది అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్ (99,030), ఆఫ్రికన్ (89,570). యూరోపియన్ (75.610) వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వల స వచ్చారు. ఈ రికార్డుల ఆధారంగా 2028 వర కు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లా టరీలకు అనర్హులుగా నిర్ణయించినట్టు తెలిపింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ లాటరీకి 2026 వరకు అర్హత సా ధించని ఇతర దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ ఉన్నాయి.

వలసదారుల పెరోల్ ఫీజు 1,000 డాలర్లు

పెరోల్ ఫేజుపై అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కొన్ని రకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజును 1000 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి , ఉండడానికి పెరోల్ అనేది తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికా లోకి అనుమతిస్తారు. ఇటీవల ట్రంప్ ప్రవేశ పెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజును తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా అమెరికా లోకి ప్రవేశించాలంటే విదేశీయులు 1000 డాలర్ల పెరోల్ రుసుమును చెల్లించాలి. వీటిలో ప్రారంభ పెరోల్, రీ పెరోల్, పెరోల్ ఇన్ ప్లేస్ లేదా డీహెచ్‌ఎస్ కస్టడీ నుంచి పెరోల్ వంటివి ఉంటాయి. ఈ రుసుము ఇప్పటికే ఉన్న ఏదైనా ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు. 

ఇది దండుపాళ్యం కేబినెట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం ముఠాలా మా రిపోయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎద్దేవా చేశా రు. మంత్రుల పంచాయితీలు పరిష్కరించడానికే కేబినెట్ సమావేశాలు పె డుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒ కరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు. కేబినెట్ భేటీలో మంత్రులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఆర డజను వర్గాలుగా విడిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా తయారైందని అన్నారు.

కేబినెట్ సమావేశంలో ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నామని చెప్పారు. దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి కరుబు చెబుతరేమో అనుకున్నామని…కానీ, తీవ్ర నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని ఆరోపించారు. వ్యాపారవేత్తలపై తుపాకులు ఎక్కుపెట్టే సంస్కృతిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ హయాంలో నీళ్లు, నిధుల వాటాలు సాధించామని ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డి హయాంలో మాత్రం అవినీతి వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంటాక్టర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారని, నీళ్లలో, నిధుల వాటా కోసం కొట్లాడారని చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రులు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం,

అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారని అన్నారు. పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల టిఎస్‌ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిదేళ్లలో అతి తక్కువ పరిశ్రమలు, పెట్టుబడులు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చారని అన్నారు. 2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, ఇది టిఎస్‌ఐపాస్ ఏర్పడిన తర్వాత అతితక్కువ పెట్టుబుడులు అని పేర్కొన్నారు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ ఘన కార్యం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం టిఎస్‌ఐపాస్ తెచ్చి అనుమతులు సులభతరం చేశామని, రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వర్షం కురుస్తుంటే కెటిఆర్ స్వయంగా గొడుగుపట్టి ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి

సిఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని హరీష్‌రావు గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారని, ముఖ్యమంత్రే స్వయంగా జపాన్ నుంచి ఫైల్ ఆప్పించారని, ఒక మంత్రి టెండర్ వేయవద్దని తమకు హుకుం జారీ చేశారని, టెండర్ దక్కలేదని డిపార్ట్‌మెంట్‌నే మార్చివేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే కాంగ్రెస్, బిజెపి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు నోరు మెదపటం లేదు..? అని నిలదీశారు.

ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..?

రేవంత్‌రెడ్డి హయాంలోని 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకా… కమీషన్ల కోసం కేబినెట్‌లో గల్లాలు పట్టుకొని కొట్టుకున్నందుకా… మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుకా… ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని అన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుతారా..? అని ప్రశ్నించారు. నెలకు రూ. 2500 ఇస్తారేమోనని మహిళలు ఎదురు చూశారు..కానీ, కేబినెట్ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయని వర్గం లేదని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుతారా.. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నందుకు ఉత్సవాలు జరుపుతారా.. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా..? అని నిలదీశారు.

పారిశ్రామిక వేత్తలు, పేదలకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుంది

పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పేదలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్‌రావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని, తాము కాపాడుతామని వ్యాపారులకు చెప్పారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు. డిజిపి శివధర్ రెడ్డి కాకీ బుక్‌లో మంత్రులకు రూల్స్ వేరేలా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరిస్తుంటే.. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే వారి మీద కేసు లేదు. ఒక ట్వీట్‌కు రీట్వీట్ చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు.

హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారు

హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే జిఒ 53, 54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారని అద్నరు. పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్‌రెడ్డి దొంగ దెబ్బ కొట్టారని మండిపడ్డారు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హ్యాం మోడల్ అనేది ఒక బోగస్ అని, దాని పేరు చెప్పి కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదని విమర్శించారు. హ్యాం మోడల్‌పై బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని హెచ్చరించారు.

శనివారం రాశి ఫలాలు (18-10-2025)

మేషం – మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన విధంగానే అనుకూలిస్తాయి. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.

వృషభం – పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార పరమైన వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు.

మిథునం – వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగుంటాయి. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు. యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు.

కర్కాటకం – బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు. మీ కంపెనీకి ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే ముఖ్య వ్యక్తి అవుతారు.

సింహం – సాంకేతిక సిబ్బందికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిదని గ్రహిస్తారు.

కన్య – భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయపరమైన నిర్ణయాలు లభిస్తాయి.

తుల – ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మీ మంచితనాన్ని అసమర్ధతగా భావించిన వాళ్లు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శన.

వృశ్చికం – నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి ఓ దారిన పడుతుంది. కొన్ని ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు మీకు దక్కుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు – ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్న అవసరానికి ధనం చేతికంది వస్తుంది. విద్యా సంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి.

మకరం – చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. ఉన్నత స్థానాలను మేదస్సుతో సాధిస్తారు. దైవభక్తి శ్రద్ధ కలిగి ఉంటారు.

కుంభం – అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయలేరు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగును. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు.

మీనం – శత్రువులు సమస్యలను సృష్టించిన అధిగమిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.