రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు : రామచందర్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి గెలుస్తుందనే నమ్మకం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలో జిల్లాల సమావేశం జరిగింది. గ్రేటర్ పరిధి జిల్లాల నాయకులకు రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేస్తామని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలియజేశారు. రేపటి నుంచి అందరూ జూబ్లీహిల్స్ లో తిరిగి ప్రచారం చేయాలని, జూబ్లీహిల్స్ లో బిజెపిని గెలిపించి రాజకీయ మార్పు చూడండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందాన్ని తిప్పికొట్టండని రామచందర్ రావు సూచించారు.