వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి : కోమటిరెడ్డి
హైదరాబాద్: రోడ్లు, భవనాలశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో 230 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్డు, వంతెనలు, కాజ్ వేల పునరుద్ధరణకు రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని కోమటిరెడ్డి తెలియజేశారు. దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్లు అవసరం అని అన్నారు. నల్గొండ జిల్లాలో వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి సెంటర్లలో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం ఉందని చెప్పారు. పత్తి తేమ శాతం గురించి ఇప్పటికే సిసిఐ ఛైర్మన్ ను కలిశానని, నిబంధన సడలించాలని రైతుల పక్షాన ముంబయి వెళ్లి విజ్ఞప్తి చేశానని కోమటి రెడ్డి పేర్కొన్నారు.