మరో ప్రజా ఉద్యమంపై కెసిఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నదుల అనుసంధానం పేరుతో ఎపి జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపణ చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బిజెపిలు ఉన్నా.. నోరు మెదపడం లేదన్నారు. కాంగ్రెస్, బిజెపిని సమాజం ముందు దోషిగా బిఆర్ఎస్ నిలబెడతామంది. బిఆర్ఎస్ ప్రక్షాలళన పైనా కెసిఆర్ ఫోకస్ పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం బిఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కెసిఆర్ సమరశంఖం జరుపనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27 లేదా 28న పాలమూరు జిల్లాలో కెసిఆర్ పర్యటన చేయనున్నారు. నదీ జలాల పరిరక్షణ లక్ష్యంగా కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టిఎంసిలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బిఆర్ఎస్ తెలిపింది.