పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా కన్నుమూత
అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా(35) బుధవారం కన్నుమూశారు. రాజవీర్ జవాండా 11 రోజుల క్రితం తన 1300 సిసి మోటారు బైక్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు విహారయాత్రకు బయలుదేరారు. సోలన్ జిల్లాలో వెళ్తుండగా పశువులు అడ్డు రావడంతో వాటిని ఢీకొట్టాడు. అతడు తల, వెన్నెముకకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మొహాలీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 11 రోజులు మృత్యువుతో పోరాడుతూ రాజవీర్ జవాండా ఇవాళ తుదిశ్వాస విడిచారు. విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ఆయన భార్య ముందుగానే వెళ్లొద్దని హెచ్చరించింది. భార్య మాటలు పెడచెవిన పెట్టి విహారయాత్రకు బయలుదేరాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసియులో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గాయకుడిపై మృతిపై ఆఫ్ నేత మనీశ్ సిసోడియా, రాజకీయ, సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పంజాబీ సినిమాలలో పలు పాటలు పాడారు. మిండో తసీల్‌దర్ని, సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్‌జాన్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.