అమ్మాయిలు కామాన్ని కంట్రోల్ చేసుకోండి కానీ వాళ్ల రూమ్‌లకు వెళ్లకండి: శ్రీరెడ్డి
హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా అమ్మాయిలను నటి శ్రీరెడ్డి హెచ్చరించింది. అబ్బాయిలు పిలవగానే ఎగేసుకుంటూ హోటల్ రూమ్‌లకు వెళ్లకండని అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. పడుకునే అమ్మాయిలను వాడుకుంటారు కానీ ఎవడు పెళ్లి చేసుకోవడని తెలియజేసింది. ప్రేమలో ఉన్నవారు కామాన్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు మిక్స్ చేయవద్దని సలహాలు ఇచ్చింది. మహిళలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై కూడా శ్రీరెడ్డి స్పందించింది. శివాజీ మంచి విషయం చెప్పారు గానే ఆయన మాటలు బాగోలేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరు కంట్రోల్‌లో చేసుకోవాలని హెచ్చరించింది. శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.