‘జైలర్-2’లో బాలకృష్ణ బదులు ఆ స్టార్ హీరో
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అలాగే రెండో భాగంలో కూడా అతిథి పాత్రలో పలువురు స్టార్స్ కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తారనే పుకార్లు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఆ వార్తలు అవాస్తవమంటూ మరిన్ని రూమర్స్ వస్తున్నాయి.
బాలకృష్ణ ఈ సినిమాలో నటించడం లేదని.. ఆయన స్థానంలో ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. జైలర్‌లో బాలకృష్ణను తీసుకుందామని తాను అనుకున్నట్లు నెల్సన్ ఓ సందర్భంలో చెప్పారు. కానీ, బాలకృష్ణ ఇమేజ్ తగ్గట్లు ఆ పాత్ర లేకపోవడంతో ముందుకు వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జైలర్ సీక్వెల్‌లో అయిన బాలకృష్ణ కనిపిస్తారని అభిమానులు భావించారు. రజనీ, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తామని అంతా ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు సడెన్‌గా విజయ్ సేతుపతి పేరు తెరమీదకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.