ఎఐ బారిన పడ్డ శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్
హైదరాబాద్: కృత్రిమ మేధ(ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనుషులకు చాలా పని భారం తగ్గిపోయింది. అయితే దీన్ని కొందరు మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎఐని చెడు మార్గంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లకి ఎఐని దుర్వినియోగం చేయడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. తాజాగా నటి శ్రీలీలకు ఎఐ ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది.
‘‘నా బిజీ షెడ్యూల్ వల్ల ఆన్‌లైన్‌లో జరిగే విషయాలపై నాకు అంతగా అవగాహన ఉండదు. నా శ్రేయోభిలాషులు కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. నేను చాలా విషయాలను పట్టించుకోను.. నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను. కానీ, ఈ విషయం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటి నటీనటులు కూడా ఇలాంటి బాధని అనుభవించారు. అందరి తరఫున నేను స్పందిస్తున్నా. దయ మరియు గౌరవంతో మాకు మద్ధతు ఇవ్వాలని కోరుకుంటున్నా. తదుపరి చర్యలు అధికారులు చూసుకుంటారు’’ అంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది.
శ్రీలీల ఫోటోలను ఎఐ ద్వారా ఎడిట్ చేసి కొందరు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చాలా మంది నెటిజన్లు అవి నిజమైన ఫోటోలే అని భ్రమపడుతున్నారు. దీంతో శ్రీలీల ఈ విధంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్‌సింగ్, పరాశక్తి తదితర చిత్రాల్లో నటిస్తోంది.
— Sreeleela (@sreeleela14) December 17, 2025