‘జటాధర’ ట్రైలర్ వచ్చేసింది.. అందరు యాక్టింగ్ కుమ్మేశారు..
హైదరాబాద్: స్టైలిష్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’. ఫాంటసీ, హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘పూర్వం ధనాన్ని దాచిపెట్టి… మంత్రాలతో బంధనాలు వేసేవారు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది.
ట్రైలర్‌లోని ప్రతీ షాట్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ధనపిశాచి’ అనే పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షి నటన, నమ్రతా శిరోధ్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ నటన ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. సుధీర్ బాబు కూడా యాక్టింగ్ కుమ్మేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు గోస్ట్ హంటర్ పాత్రలో నటిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.