షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ.. టైటిల్ ఏంటంటే..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అయితే రీసెంట్‌గా షారుఖ్ సినిమాల నుంచి చాలా గ్యాప్ తీసుకున్నారు. 2023లో వచ్చిన ఢంకీ సినిమా తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దీంతో ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నవంబర్ 2న షారుఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమా వివరాలను వెల్లడించారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘కింగ్’ అనే టైటిల్ రివీల్ చేశారు. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఆరంభంలో యాక్షన్‌తో అదరగొట్టిన షారుఖ్.. చివర్లో డిఫరెంట్ లుక్‌తో కనిపించారు. ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా 2026లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుటికే సిద్ధార్థ్, షారుఖ్ కాంబోలో వచ్చిన పఠాన్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.