చిరు హిట్ సినిమా క్యారెక్టర్లతో అనిల్ రావిపూడి సెల్ఫీ
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 12న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని అనిల్ కూడా ఫాలో అయ్యారు. ఎఐ సాయంతో సినిమా నటులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఉండే వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనిల్ కూడా అదే చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించి ‘ఖైదీ’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ తదితర చిత్రాల్లో చిరంజీవి పాత్రలతో సెల్ఫీ దిగుతున్నట్లు ఉండే ఓ వీడియోని ఆయన షేర్ చేశారు. చివర్లో తన సినిమాని కూడా జత చేశారు. ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.
Going with the trend 😃👌🏻
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు🥳🥳🥳
Thanks to AI 😄
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు 😉)#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/o23yvZOlMw— Anil Ravipudi (@AnilRavipudi) December 21, 2025