పుష్ప 2 తొక్కిసలాట… ఎ11గా అల్లు అర్జున్… ఎ1గా సంధ్య థియేటర్ యాజమాన్యం
హైదరాబాద్: గత సంవత్సరం డిసెంబర్లో పుష్ఫ2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటి వరకు చికిత్స పొందుతున్నాడు. పుష్ప 2 తొక్కిసలాట ఘటన లో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ ధాఖలు చేశారు. ఈ ఘటనలో 23 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో పోలీసులు చేర్చారు. ఎ1గా సంధ్య థియేటర్ యాజమాన్యం, ఎ11 గా నటుడు అల్లు అర్జున్ తో ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లతో నలుగురు ప్రత్యేక సాక్షులను కూడా ఛార్జిషీట్ లో చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే తొక్కిసలాట జరిగిందని నిర్ధారించారు. తొక్కిసలాట ఘటన 2024 డిసెంబర్ లో జరిగింది.