సింగరేణి ఇంచార్జ్ సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్
హైదరాబాద్: సింగరేణి సంస్థ ఇంచార్జ్ సిఎండిగా ఐఎఎస్ అధికారి కృష్ణభాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇంచార్జ్ సిఎండి బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో కృష్ణభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర రెవెన్యూ సర్వీస్ నుంచి డిప్యుటేషన్‌పై తెలంగాణకు వచ్చిన బలరాం.. సింగరేణిలో సంచాలకుడిగా, ఇంచార్జ్ సిఎండిగా ఆరు సంవత్సరాల పాటు పని చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్ గడువు సాధారణంగా ఐదేళ్లే ఉంటుంది. అంతకు మించి ఏడాది అదనంగా ఉన్నందున మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదు.