మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. శని అనుకూలంగా ఉన్నాడు. రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. పెండింగ్ బిల్స్ ఈవారం క్లియర్ అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహోదరీ సహోదరుల మధ్య సఖ్యత బాగుంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది. అప్పులు తీర్చే దిశగా అడుగులు వేస్తారు. సాధ్యమైనంతవరకు రుణాలు లేకుండా చూసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పోటీ పరీక్షలలో పాల్గొంటారు, విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా పి ఆర్ విషయాలలో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే.
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అనుకున్నట్టుగానే నూతన వ్యాపారం ప్రారంభిస్తారు అందులో విజయం సాధిస్తారు. హోటల్ మేనేజ్మెంట్ కళా రంగంలో ఉన్నవారికి, ఫుడ్ వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు బాగున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అవసరమైతే తప్పా ఖర్చు చేయకపోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నూతన కోర్సులను నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. రాజకీయాలలో పాల్గొంటారు. స్థిరమైన ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళ వారాలు అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ మనో సంకల్పమే మిమ్మల్ని చాలా విషయాలలో విజేతగా నిలబెడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకున్న స్థాయిని సాధించగలుగుతారు. కెరియర్ పరంగా చాలా వరకు బాగుంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి స్థాయికి తగిన ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి కళా రంగంలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు గ్రీన్.
కర్కాటక రాశి: వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫైనాన్స్ సెక్టర్ లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. లోన్లు తీర్చి వేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి భారం పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విహార యాత్రలలో, విందు వినోదాలలో పాల్గొంటారు. నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మిల్కీ వైట్.
సింహ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు బాధిస్తాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. ప్రతిరోజు నాగ సింధూరం ధరించడం వలన నరదృష్టి తొలగిపోతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరింప చేయాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్నఇబ్బందులు ఉంటాయి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. సమయానికి నిద్ర మంచి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రేమ వివాహాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ల సలహాలు సూచనలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు కొద్దిమందికి మాత్రమే. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు పీచు కలర్.
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఉద్యోగ పరంగా స్థాన చలనం ఏర్పడుతుంది. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.భూ సంబంధమైన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలలో ఉన్న వారికి పి.ఆర్ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కొన్ని కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. కరుంగళి మాల మెడలో ధరించండి. ఒక స్థాయి సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటబయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా కొన్ని చిక్కులు ఏర్పడుతాయి. మీకు అన్ని విషయాలలో కలుసుబాటు కోసం సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడానికి మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. విదేశీ ప్రయత్నాలు సానుకూల పడతాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకోవాలి. వ్యాపారంలో లాభనష్టాలు సరి సమానంగా ఉంటాయి. నష్టాలు వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోకుండా ఓర్పుతో వ్యవహరించండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి అలాగే సుబ్రమణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరున్.
ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని నిదానంగా సాగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఎవరి మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తారు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థిని విద్యార్థులకు కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తు లకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు కాషాయం.
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా, స్థిరాచరాస్తుల పరంగా బాగుంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వచ్చిన లాభాలను పొదుపు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఎంతో కాలంగా కోర్టులో పెండింగ్ ఉన్న వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది. అపాత్ర దానం మంచిది కాదు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేతి వరకు వచ్చిన అవకాశాలు కొన్ని చేజారిపోతాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగపరంగా కొన్నిమార్పులు చేర్పులు ఉంటాయి. చిరు వ్యాపారస్తులకు ధాన్య వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగానే ఉంది. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. జాతక పరిశీలన చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు, నేవీ బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలలో ఏదో విధంగా కొన్నిఆటంకాలు ఏర్పడతాయి. నర దిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. కుటుంబ పరంగా, ఆర్థికంగా కొన్ని మేలు చేకూరే ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నత్తనడకన సాగుతుంది. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొంటారు. మీకున్న తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. న్యాయం వైపు మాత్రమే మీరు ఉంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు.