గద్వాల్‌లో ఫ్రిడ్జ్ పేలి తల్లీకుమారుడు మృతి
గద్వాల్: ఫ్రిడ్జ్ పేలి తల్లీకుమారుడు మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో రోజుల క్రితం ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడంతో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డాడు. వెంటనే ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐసియులో చికిత్స పొందుతూ తల్లీకుమారుడు చనిపోయాడు. గోడకు 20 సెంటీ మీటర్ల దూరంలో ఫ్రిడ్జ్‌ను ఉంచడంతో పాటు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. వైరింగ్, ప్లగ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయాలని తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.