ఆస్పత్రిలో కుప్పకూలిన సెంట్రింగ్.. ముగ్గరు మృతి
హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లో పని చేస్తుండగా.. సెంట్రింగ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఆస్పత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు ఎమర్జెన్సీ వార్డులో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.