హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్య
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ మెన్ కృష్ణ చైతన్య తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు… ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసుల భావిస్తున్నారు. చైతన్య గత కొంతకాలంగా అప్పులు, ఆర్థిక ఒత్తిడితో మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.