దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలపై పోలీసుల దాడులు.. భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ది పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలు నిర్వహిస్తుండడంతో పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి బర్త్ డే పార్టీ నిర్వహించారు. మాధురి పుట్టిన రోజు వేడుకలను వైసిపి నాయకులతో పార్టీ నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు. రెండు సంవత్సరాల క్రితం మాధురిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు, 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో కలిసి ఉంటున్నాడు. డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్ వేడుకలను మద్యంతో ఘనంగా నిర్వహించడంతో పోలీసులకు దొరికారు.