వర్క్ ఫ్రమ్ హోం.. షాక్ కొట్టి యువకుడు మృతి
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్‌తో భూషి గణేశ్ (26) మృతి చెందాగా.. తండ్రి నర్సింహాకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ సంస్థలో గణేశ్ సాఫ్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల వారి ఇంటికి సిమెంట్ ప్లాస్టరింగ్ పనులు చేయించారు. పనుల కోసం ఏర్పాటు చేసి ఇనుప పైసలను తొలగిస్తున్న క్రమంలో గోడ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఒక్క కుమారుడు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.