కాలుష్య కోరల్లో ఢిల్లీ
ఢిల్లీ: దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో వాయు కాలుష్యం పెరగడంతో ప్రజలను తీవ్ర అస్వస్థతకు గురువుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా గాలి నాణ్యత పడిపోయింది. హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం, గాలి నాణ్యత సూచి 491కు చేరుకుంది. గత రెండు రోజులతో పోలిస్తే మరింత వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి టపాసులతో పాటు వ్యవసాయ వ్యర్థాలు కాల్చడంతోనే వాయు కాలు ప్రమాదకర స్థాయికి చేరుకుందిని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ విభాగం వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఆదివారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ప్రకారం వివిధ ప్రాంతాలలో ద్వారకా(417ఎక్యుఐ), అశోక్ నగర్(404), వాజిర్ పూర్(423), అనంద్ విహార్(404)గా ఉంది. అస్తమా రోగులు ఊపిరి పీల్చుకోవడంతో కష్టంగా మారింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. రోడ్ల మీదికి వస్తే చాలు ఊపిరి ఆడడంలేదు.