వేధింపులు తట్టుకోలేక భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
భూపాలపల్లి: భార్య వేధింపులు తట్టుకోలేక ఆమెను చంపేసి అనంతరం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలంలో జరిగింది. సీతారాంపురం గ్రామంలో రామాచారి(45), సంధ్య(42) అనే దంపతులు నివసిస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి భర్తను భార్యవేధించడంతో ఓపిక పట్టాడు. భార్య వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను హత్య చేశాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.