విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం… టీచర్ పై పోక్సో కేసు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మూడేళ్లుగా చిన్నారిపై టీచర్ అత్యాచారం చేశాడు. ఓ ప్రైవేటు స్కూల్‌లో చెన్నంపల్లి జలపతి రెడ్డి అనే వ్యక్తి సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. కూతురు తీరుపై మార్పును గమనించి తల్లిదండ్రులు నిలదీశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ చేయగా నిందితుడు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.