పంతులమ్మతో పంతులయ్యకు వివాహేతర సంబంధం… భర్తను చంపి
నాగర్ కర్నూల్: పిల్లలకు పాఠాలు చెప్పి బుద్దులు నెర్పించాల్సిన పంతులు, పంతులమ్మ దారి తప్పారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని అతడిని భార్య తన ప్రియుడితో కలిసి చంపింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మారతీనగర్‌లో లక్ష్మణ్ నాయక్(35), పద్మ(30) అనే దంపతులు నివసిస్తున్నారు. పద్మలో 2024 డిఎస్‌సిలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం రావడంతో ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు గోపితో పద్మ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం సంవత్సరం నుంచి కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా లక్ష్మణ్ నాయక్ పని చేసేవాడు.
భార్యకు జాబ్ రావడంతో అచ్చంపేటలో ఖాళీగా ఉండేవారు. వివాహేతర సంబంధానికి లక్ష్మణ్ అడ్డుగా ఉండడంతో చంపేయాలని పద్మ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 రాత్రి గాఢ నిద్ర పోతున్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిపై వస్త్రంతో మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా తెల్లవారుజామున పద్మ స్కూల్‌కు వెళ్లింది. తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని యజమానికి ఫోన్ చెసి చెప్పింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. పద్మ తన భర్తను హత్య చేసిన అనంతరం దగ్గరి బంధువు నర్సింహకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పద్మ ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పద్మను పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. పద్మ, ప్రియుడు గోపీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.