హైదరాబాద్ విజయం
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో జమ్ముకశ్మీర్ టీమ్‌ను ఓడించింది. ఓవరాల్‌గా హైదరాబాద్‌కు ఈ టోర్నీలో ఇది నాలుగో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము టీమ్ 19.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభమ్ ఖజురియా (35), కవల్‌ప్రీత్ సింగ్ (21), నసీర్ లోనె(17) పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నితిన్ సాయి యాదవ్, కెప్టెన్ సివి మిలింద్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 15.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్నిఅందుకుంది. వికెట్ కీపర్ ప్రఘ్నయ్ రెడ్డి (31) నాటౌట్, తనయ్ త్యాగరాజన్ (50) అద్భుత బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించారు.