రెండో టి20లో భారత్ చిత్తు
51 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
ముల్తాన్‌పూర్: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో భారత్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా విఫలమైన టీమిండియా 51 పరుగుల తేడాతో చిత్తయింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాటం నేర్చుకున్న సఫారీ జట్లు అద్భుతమైన ఆటతీరుతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌లో సమంగా నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ప్రారంభంలో తడబిడినా క్వింటాన్ డికాక్(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
జట్టు స్కోరు 38 పరుగులు ఉన్నప్పుడు రీజా హెన్‌డ్రిక్స్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఔటవగా.. డీకాక్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మాక్రామ్(29)తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం ఫెర్రెరా(30), డెవిడ్ మిల్లర్(20) రాణించడంతో జట్టుకు స్కోరు 213 పరుగులకు చేరింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ తొలి నుంచి వికెట్లు కోల కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ పరుగులేమి చేయకుండా డగౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(17) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. తిలక్ వర్మ(62) అర్ధ సెంచరీతో మెరిసినా మరెవరూ రాణించక పోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో సఫారీ జట్టు సిరీస్‌లో 11 సమంగా నిలిచింది.