ఎపి మంత్రి నారా లోకేశ్‌కి.. తిలక్ వర్మ కానుక..
ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా తిలక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే తిలక్ శర్మ ఎపి మంత్రి నారా లోకేశ్‌కి కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగంచిన క్యాప్‌ను నారా లోకేశ్‌కి గిఫ్ట్ గా ఇవ్వనున్నాడు. ఈ మేరకు తిలక్ వర్మ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
తిలక్ వర్మ బహుమతికి మంత్రి లోకేశ్ ఎంతో సంతోషించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి వచ్చాక నీ చేతుల మీదుగానే క్యాప్‌ని తీసుకుంటా’’ అంటూ లోకేశ్ పేర్కొన్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా, భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో తిలక్ వర్మ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి విజేతగా నిలిచింది.