గంభీర్‌కు స్ట్రోక్ ఇచ్చిన రోహిత్.. అతడి వల్లే గెలిచామంటూ..
టీం ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు చోటెు చేసుకున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో గంభీర్ కాస్త కఠినంగా వ్యవహరించారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రోహిత్ తాజాగా గౌతీకి స్ట్రాంగ్ స్ట్రక్ ఇచ్చాడు. సియట్ టైర్స్ క్రికెట్ రేటింగ్ అవార్డు కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరయ్యాడు.
ఈ ఏడాది భారత్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినందుకు రోహిత్‌కు ప్రత్యేక పురస్కారం ఇచ్చారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి ట్రోఫీని చేజార్చుకున్నామని.. ఈసారి మాత్రం అలాంటి తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం ఒక ఆటగాడి విజయం కాదని.. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరి కృషి అని తెలిపాడు.
ఇక గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలోకి గౌతమ్ గంభీర్ వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీరే జట్టుకు కోచింగ్ ఇచ్చినా.. రోహిత్ మాత్రం తమ విజయం వెనుక ద్రవిడ్ ఇచ్చిన సూచనలు ఉన్నాయని పరోక్షంగా చెప్పడు. దీంతో గంభీర్‌కు రోహిత్ గట్టి స్ట్రోక్ ఇచ్చినట్లైంది.