ఐపిఎల్ వేలం.. భారీ ధర పలికిన కామెరూన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 మినీ వేలం ఘనంగా ప్రారంభమైంది. 77 స్లాట్స్‌కు గాను 369 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇందులో 244 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 115 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. అతడి బేస్ ధర రూ.2 కోట్ల ఉండగా.. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్‌కతా రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను దక్కించుకుంది. దీంతో ఐపిఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా గ్రీన్ రికార్డు సృష్టించాడు.
అంతకు ముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను కెకెఆర్ రూ.24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపిఎల్ చరిత్రలో గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. అతడి కంటే ముందు రిషబ్ పంత్ (రూ.27 కోట్లు, ఎల్ఎస్‌జి), శ్రేయస్ అయ్యర్(రూ.26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్) ఉన్నారు. ఇక వేలంలో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను బేస్ ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే (బేస్ ధర రూ.2 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (బేస్ ధర రూ.2 కోట్లు), భారత బ్యాటర్లు పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్ (బేస్ ధర రూ.75 లక్షలు) అన్‌సోల్డ్‌గా మిగిలారు.