యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది: రషీద్ ఖాన్
కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో పాటు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఆప్ఘానిస్థాన్ లోని ప్రావిన్స్‌లో పాకిస్తాన్ వైమానిక దాడి చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఆప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వైమానిక దాడిలో కన్నుమూసిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, పాకిస్థాన్ చేసిన దాడి అత్యంత హేయమైన, అనాగరిక చర్య అని మండిపడ్డారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండా జీవితం ముగిసిందని బాధను వ్యక్తం చేశారు. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పాకిస్థాన్‌తో తలపడబోయే ట్రై సిరీస్‌తో తాము పాల్గొనబోమని వెల్లడించారు. ఆట కంటే దేశ సమగ్రత ముఖ్యమని రషీద్ ఖాన్ చెప్పారు.