రాణించిన స్మృతి, ప్రతీకా.. కివీస్ లక్ష్యం ఎంతంటే..
నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో భారత ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీకా రావల్‌లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు స్మృతి, ప్రతీకాల జోడి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన స్మృతి(109) బేట్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత కొంత సమయానికే సెంచరీ సాధించిన ప్రతీకా (122) కెర్ర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజ్‌లో ఉన్న జెమీమా పరుగుల వరద పారించింది. 55 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కి కొంత సమయం అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ని 49 ఓవర్లకు కుదించారు. దీంతో 49 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో మైర్, కెర్ర్, బేట్స్ తలో వికెట్ తీశారు.