చివరి టి-20: రెండు వికెట్లు కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. అయితే బాష్ వేసిన 6వ ఓవర్ నాలుగో బంతికి అభిషేక్(34), కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లిండే వేసిన 10వ ఓవర్ తొలి బంతికి శాంసన్(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజ్‌లో తిలక్ వర్మ (34), సూర్యకుమార్(5) ఉన్నారు.