రాణించిన టెయిలెండర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్..
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మొత్తానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించి సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ పంపించారు. 247/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సెనురన్ ముత్తుస్వామి (109) సెంచరీ చేసి ఔట్ కాగా.. మార్కో జెన్సన్ 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.