టి-20 ప్రపంచకప్ షెడ్యూల్.. ఎప్పుడు విడుదలంటే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్‌కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్‌లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యుఎఇ, ఒమన్, వెస్టిండీస్, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
అయితే ఈ టోర్నమెంట్ ఈసారి భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగుతుంది. భారత్‌లో ఐదు వేదికల్లో(అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు వేదిక జరుగనున్నట్లు సమాచారం. ఇక టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారని టాక్. అయితే ఒకవేళ పాక్ ఫైనల్స్‌కి చేరితే ఆ మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.