అండర్-19 ఆసియాకప్.. సెమీఫైనల్ రద్దైతే పరిస్థితి ఏంటీ.?
దుబాయ్: అండర్-19 ఆసియాకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభంకాలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను ప్రారంభించలేదు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ది సెవన్స్ స్టేడియం వేదికగా జరగాల్సి ఈ మ్యాచ్‌కి కూడా వరుణ గండం ఉన్నట్లు సమాచారం. మరి రెండు మ్యాచ్‌లు రద్దైతే.. పరిస్థితి ఏంటని అభిమానులు సందేహం మొలకెత్తింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్ ఉన్న జట్లు ఫైనల్స్‌కి చేరుకుంటయి. ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం (డిసెంబర్ 21)న ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరుగనుంది.