రాజన్నసిరిసిల్ల జిల్లాలో 11 గంటల వరకు 48.49 శాతం పోలింగ్ నమోదు
రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 48.49 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చందుర్తి(41.06), కోనరావుపేట(52.19), రుద్రాంగి(46.04), వేములవాడ(53.23), వేములవాడ రూరల్(49.55) శాతం పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.