జగిత్యాలలో 11 గంటల వరకు 51.77 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 51.77 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. బీర్పూర్(54.22), జగిత్యాల(54.9). జగిత్యాల రూరల్(54.72), కొడిమాయిల్(50.04), మలైల్(44.48), రాల్కల్(55.57), సారంగపూర్(52.76) మండల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.