ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో
ఎదురు కాల్పులు మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు
హిడ్మా, ఆయన సతీమణి రాజే సహా ఆరుగురు మావోయిస్టులు
హతం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర విఘాతం 26 సాయుధ
దాడులకు నాయకత్వం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి
మృతదేహాల తరలింపు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు చిన్న
వయస్సులోనే ఉద్యమంలో చేరిన మద్వి హిడ్మా ఆయనపై రూ.కోటి
రివార్డు కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ భారీ స్థాయిలో
ఆయుధాలు స్వాధీనం కగార్ ఆపరేషన్‌లో తప్పించుకొని
మారేడుమిల్లిలో శవమైన మావోయిస్టు నేత కొడుకా లొంగిపోమ్మ
తల్లి కోరిన వారం రోజులకే ఎన్‌కౌంటర్
మనతెలంగాణ/ఖమ్మంబ్యూరో: ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నేత, సిపిఐ ఎంఎల్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ పోరాట యోధుడు, భూమ్కల్ తిరుగుబాటుయోధుడు గుండాధుర్‌వారసుడు,మడవి హిడ్మా అలియాస్ సంతోష్ మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కగార్ ఆపరేషన్‌లో తప్పించుకు ని మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పులు పెట్టిన మావోయిస్టు గెరిల్లా కమిటీ కార్యదర్శి అయిన హిడ్మాతో పాటు అతని భార్య రాజే మరో నలుగురు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, మారేడుమిల్లి టైగర్ జోన్, అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కు మార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డిజి మహేష్ చంద్ర లడ్హా ధృవీకరించారు. మావోయిస్టు గెరిల్లా కమిటీ కా ర్యదర్శిగా, ఒకటో బెటాలియన్ కమాండెంట్‌గా ఉంటూ మిలటరీ ఎత్తుగడలో దిట్ట, వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నక్సల్. ఇటీవలనే అతని ఇంటికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి కూడా వెళ్లి, పోలీసులకు లొంగిపోవాల్సిందిగా హిడ్మా తల్లిని కలిసి కోరిన కొద్దిరోజులకే ఎన్ కౌంటర్‌కు గురయ్యాడు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, మింతగుపా పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమర్పిడి అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భద్రాచలం డివిజన్ సరిహద్దు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని అల్లూరి సీతారామారాజు జిల్లా, రంపచోడవరం మండలం, మారేడుమిల్లి ప్రాంతంలో ని లోతట్టు ప్రాంతంలో టైగర్ జోన్ పుల్లగండి అడవుల్లోని నల్లూరు జలపాతం వద్ద మావోయిస్ట్ అగ్ర నేతలు తలదాచుకున్నారనే పోలీసు బలగాలకు అందిన విశ్వసనీయ సమాచారం అందిం ది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజాము నుంచే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూంబింగ్ చేపట్టారు. అంతలోనే ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 6,7 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు, పోలీసు పార్టీ మధ్య జరిగిన ఎదురుకాల్పులు హిడ్మాతో పాటు, అత ని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజే అ లియాస్ రాజక్క, ఆయనకు సెక్యూరిటీ ఉన్న దేవే, లక్మల్ అలియాస్ చైతు, మల్ల అలియాస్ మల్లాలు, కమ్లు అలియాస్ కమ్లేష్ మృతి చెం దారు.
ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో షెల్టర్ తీసుకునేందుకు కొందరు, అడవుల్లోనే ఉండి పార్టీ కార్యకలాపాలను కొనసాగించేందుకు మరికొందరు ఎపి రాష్ట్రం వైపు వస్తున్న క్రమంలో పోలీసులకు అందిన సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఎపి ఎడిజి లడ్డా తెలిపారు. ఘటనా స్థలం లో రెండు ఎకె -47, ఒక్కొక్కటి చొప్పున పిస్టల్, 303 రివాల్వర్, సింగిల్ బోర్ తుపాకీ, పలు ఆయుధాల తూటాలు, డిటొనేటర్లు, బీజీవిల్ లాం చర్లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు -150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ -1, కెమెరా ఫ్లాష్ లైట్ -1, కటింగ్ బ్లేడ్- 1, ఫ్యూజ్ వైర్ -25 మీటర్లు, 7 కిట్ బ్యాగులు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన హి డ్మాపై రూ. కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఆరుగురు మావోయిస్టులు త ప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు అధికారులు తెలిపా రు. అయితే ఇదేరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, కాకినాడ నగరాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ కావడం గమనార్హం.