మహిళతో కొలికపూడి వీడియోలు… సోషల్ మీడియాలో వైరల్
అమరావతి: ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపి కేశినేని చిన్ని మధ్య టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వరుస పోస్టులతో ఎంపి వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇటీవల కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను చిన్ని వర్గీయులు విడుదల చేశారు. టిడిపి సోషల్ మీడియా గ్రూపుల్లో కొలికపూడి ఫోటో చక్కర్లు కొట్టింది. కౌంటర్ గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోస్టు చేశారు. తిరువూరుకు చెందిన బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను కొలికపూడి విడుదల చేయడంతో వైరల్ గా మారాయి. రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా? అంటూ పోస్టులు పెట్టారు. కొలికపూడిపై ఎంపి చిన్ని వర్గం రగిలిపోతుంది. ఎఐతో తయారు చేసి ఫోటోలు విడుదల చేశారంటూ ఎంపి కేశినేని చిన్నిపై కొలికపూడి వర్గం మండిపడుతుంది.
టిడిపిలో ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపి చిన్ని వర్గీయులకు కొలికపూడి వరసగా షాక్ లు ఇస్తున్నారు. విస్సన్నపేట మండల టిడిపి నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా ?’ అంటూ విమర్శలు గుప్పించారు. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే కేశినేని నిజంగా రాయల్ అని దుయ్యబట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో హాట్ టాపిక్ గా మారాయి.