శ్రీలంకలో తుఫాన్ విలయతాండవం.. ఎపి, తమిళనాడుకు ముప్పు
కొలంబో: శ్రీలంకలో దిత్వా తుఫాన్ విలయతాండవం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో శ్రీలంక చిగురటాకుల వణికిపోతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. వరదలలో 56 మంది మృతి చెందాని అధికారులు వెల్లడిచంఆరు. పోలీసులు, అధికారులు, రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నారు. 21 మంది ఆచూకీ గల్లంతు కావడంతో పాటు 600పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గత 24 గంటలలో వయునియా ప్రాంతంలోని చెడ్డికులం 315 మిమి, ముల్లెతీవు ప్రాంతం అలపల్లిలో 305 మిమి వర్షపాతం నమోదైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలను తిరువనంతపురం, బెంగళూరు వైపు మళ్లిస్తున్నారు.
దిత్వా తుఫాన్ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలలో నవంబర్ 30 రాత్రి నుండి డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3, 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రకాశం, బాపట్ల, ఎన్టిఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 2వ తేదీల్లో వర్షాలు ఉంటాయి, డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి (బంగాళాఖాతం) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ – గుంటూరు – ఏలూరు ప్రాంతాల్లో కచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి జిల్లాల్లో డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు కురువనున్నాయి. డిసెంబర్ 1న వైజాగ్ – అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మేఘావృతమైన ఆకాశం, చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురుస్తాయి.